Prakasam

News May 15, 2024

ప్రకాశం : బైక్ లు ఢీకొని ఒకరు దుర్మరణం

image

మర్రిపూడి మండలం శివరాయునిపేటకు చెందిన మానివేల చిన్నవీరయ్య, చీమల వెంకటేశ్వర్లు బైక్ పై ఉప్పలపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో మర్రిపూడి మండలం చిమటకు చెందిన జానపల్లి వెంకటేశ్వర్లు బైకుపై మర్రిచెట్లపాలెం వెళ్తున్నారు. ఉప్పలపాడు సమీపంలో బైక్ లు ఢీకొనడంతో చిన్నవీరయ్యకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై కోటయ్య కేసు నమోదు చేశారు.

News May 15, 2024

చినగంజాం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

image

ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదంతో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. అయితే, వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. చినగంజాం మండలం నీలాయిపాలెంకు చెందిన ఉప్పుగుండూరు కాశీ (65), లక్ష్మి (55), చిన్నారి సాయిశ్రీ (8) మృతి చెందారు. ఒకేసారి కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

News May 15, 2024

ప్రకాశం: ఈనెల 17 నుంచి పలు రైళ్లు రద్దు

image

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు గుండా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 17 నుంచి 31 వరకు గుంటూరు-గుంతకల్లు డంప్లింగ్ పనుల కారణంగా (17329/17330) హుబ్లీ నుంచి విజయవాడ, (17251/17252) గుంటూరు నుంచి కాచిగూడ వంటి రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కావున రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు.

News May 14, 2024

పొదిలి: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

image

పొదిలి మండలం సలకనుతల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొనడంతో శ్రీశైలం-ఒంగోలు జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభంతో పాటు వైర్లు నేలకు ఒరిగాయి. ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారుకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

News May 14, 2024

ప్రకాశం: రైలు ఢీకొని మహిళ మృతి

image

వేటపాలెం సమీపంలోని నాగవరపమ్మ రైల్వేగేట్ వద్ద రైలు ఢీకొనడంతో ఓ మహిళ (50) మృతి చెందింది. ఆమె వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, మృతురాలు పసుపురంగు చీర ధరించిందని చీరాల జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని వారు పేర్కొన్నారు. కాగా మృతురాలి సమాచారం తెలిసిన వారు 9440627646 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.

News May 14, 2024

పర్చూరు: తనకు తాను ఓటేసుకోని YCP MLA అభ్యర్థి

image

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ తను పోటీ చేసిన పర్చూరు నియోజకవర్గంలో ఓటు వేయడానికి అవకాశం లేకపోయింది. స్వగ్రామమైన చీరాలలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పర్చూరు నియోజకవర్గ వైసీపీ టికెట్ ఆయనకు ఖరారవడంతో ఆయన ఓటును పర్చూరుకి మార్చుకునే అవకాశం లేకపోయింది. కాగా కూటమి తరఫున పర్చూరులో ఏలూరి సాంబశివరావు పోటీలో ఉన్నారు.

News May 14, 2024

ఓటేయని ఎమ్మెల్యే బుర్రా

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ MLA ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కందుకూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నిన్న పోలింగ్ సరళిని పరిశీలించడానికి కందుకూరులో విస్తృతంగా పర్యటించారు. ఈక్రమంలో ఆయన కనిగిరికి వెళ్లి ఓటు వేయలేకపోయారు. బుర్రా తీరుపై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

News May 14, 2024

ప్రకాశం జిల్లా పోలింగ్ శాతం 82.63

image

జిల్లాలో పోలింగ్ చెదురుమదురు సంఘటనలు తప్ప, ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి, కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. వై.పాలెం 81.58% దర్శి 83.59, సంతనూతలపాడు 86.17, ఒంగోలు 82.15, కొండపి 79.93, మార్కాపురం 84.08, గిద్దలూరు 81.43, కనిగిరి 81.87, అద్దంకి 86.75, చీరాల 83.32, పర్చూరు 80.50, కందుకూరు 82.19శాతం ఉంది. కాగా 82.63 జిల్లాలో నమోదయిందని తెలిపారు. ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

News May 13, 2024

కారంచేడు: బాధను దిగమింగి ఓటు వేసిన మహిళ

image

కారంచేడు మండల పరిధిలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో వీవోఏగా పనిచేస్తున్న గర్నెపూడి చిట్టెమ్మ భర్త సింగయ్య సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. అయినప్పటికీ ఆమె ఆ బాధను దిగమింగుకుని ఓటు వేసేందుకు కారంచేడు గ్రామంలోని 178వ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఘటన తెలిసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

News May 13, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 11 గంటలకు పోలింగ్ శాతం

image

☛ దర్శి: 26.52%
☛ గిద్దలూరు: 25.97% ☛ కనిగిరి: 26.45%
☛ కొండపి: 12.00%
☛ మార్కాపురం : 25.09%
☛ ఒంగోలు: 25.06%
☛ సంతనూతలపాడు: 27.89%
☛ యర్రగొండపాలెం: 22.63%
☛ అద్దంకి: 27.80%
☛ చీరాల: 23.50% ☛ పర్చూరు: 29.33%
☛ కందుకూరు: 23.62%