Prakasam

News April 11, 2024

ప్రకాశం: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

image

జిల్లాలోని రాచర్ల మండలం అనుములపల్లిలో ఉపాధి పనికి వెళ్లిన కూలీ గల్ల ఆంజనేయులు (55) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పనిచేస్తుండగా ఆంజనేయులుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మిగతా కూలీలు గమనించి హుటాహుటిన రాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఆంజనేయులు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

News April 11, 2024

ఒంగోలు: 30 మంది TDP నేతలపై కేసు నమోదు 

image

ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో సమతానగర్ పరిధిలోని వాలంటీర్ సుజన ప్రియా ఫిర్యాదు మేరకు 30 మంది TDP నేతలపై గురువారం పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వాలంటీర్‌తో కలిసి YCP నేతలు ప్రచారం చేస్తున్నారని కొందరు ఫొటో తీశారు. దీనిపై రగడ జరగడం, ఆ వార్డు టీడీపీ బాధ్యుడు మోహన్ రావు అక్కడికి వెళ్లడంతో గొడవ పెద్దదైంది. అనంతరం రిమ్స్‌లో ఇరు వర్గాల కవ్వింపు చర్యల నేపథ్యంలో TDP నేతలపై కేసు నమోదైంది.

News April 11, 2024

ఎస్పీ కార్యాలయం ఎదుట దామచర్ల ఆందోళన

image

ఎస్పీ సుమిత్ సునీల్ కార్యాలయం ఎదుట ఒంగోలు TDP అభ్యర్థి దామచర్ల జనార్దన్ బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. నగర పరిధిలోని సమతానగర్‌లో వాలంటీర్‌తో కలిసి YCP నేతలు ప్రచారం చేస్తుండడంతో కొందరు ఫొటో తీశారు. దీనిపై రగడ జరగడంతో 37వ వార్డు టీడీపీ బాధ్యుడు మోహన్ రావు అక్కడికి వెళ్లడంతో వారంతో దాడిచేశారు. దీంతో అతడికి తీవ్ర రక్త స్రావం అయింది. టీడీపీ అభ్యర్థి జనార్దన్ ఎస్పీ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు.

News April 11, 2024

షర్మిలతో ఆమంచి భేటీ

image

పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బెంగళూరులో కలిశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు తొలిసారిగా చీరాల అసెంబ్లీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన షర్మిలకు గుర్తు చేశారు. తన చేరికకు వీలుగా చీరాల రావలసిందిగా ఆమంచి ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. 

News April 10, 2024

దర్శి వైసీపీ ఎమ్మెల్యేను కలిసిన గొట్టిపాటి లక్ష్మి

image

దర్శి నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను దర్శి నియోజకవర్గం కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆయన నివాసంలో బుధవారం కలిశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఆహ్వానం మేరకు గొట్టిపాటి లక్ష్మి కలిసినట్లు స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేను గొట్టిపాటి లక్ష్మి కలవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

News April 10, 2024

చీమకుర్తిలో 2.6 కేజీల గంజాయి పట్టివేత

image

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గ్రానైట్ కు నిలయమైన చీమకుర్తి పట్టణంలో గంజాయి భూతం జడలు విప్పుతోంది. ఇటీవల బడ్డీ బంకుల్లో సైతం గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. తాజాగా 2.6 కేజీల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చీమకుర్తిలో ఎస్ఈబీ డీఎస్పీ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.

News April 10, 2024

కురిచేడు: విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

image

కురిచేడు మండలంలోని పడమర నాయుడుపాలెంలో విద్యుత్‌షాక్‌ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..  గ్రామానికి చెందిన పల్లె పాపయ్య(49) ఇంట్లో ఫ్యాన్‌ తిరగకపోవడంతో మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News April 10, 2024

చీరాల: ‘మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా’

image

ఇటీవలే పదో తరగతి పరీక్షలు అయిపోయిన విషయం విధితమే. తాజాగా మూల్యాంకనం నిర్వహించారు. చీరాలకు చెందిన ఓ విద్యార్థి ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాశాడు. దీంతో విస్తుపోయిన టీచర్ దానిని పై అధికారులకు చూపించారు. అయితే ఈ విద్యార్థికి వందకు 70 మార్కులు రావడం విశేషం. మరో సబ్జెట్‌లో మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది. అని రాయడంతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు.

News April 10, 2024

కొండపి: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

image

కొండపి మండలం, కట్టుబడిపాలెం-వెన్నూరు గ్రామాల మధ్య మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. గోగినేనివారిపాలెంకు చెందిన గోగినేని శాంతి తన కూతురు యశ్విత లక్ష్మి(9), కుమారుడు దేవాన్ష్‌తో కలిసి స్కూటీపై గ్రామానికి వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యశ్విత లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణబాజీబాబు చెప్పారు.

News April 10, 2024

చీరాలలో త్రిముఖ పోరు.?

image

చీరాలలో రాజకీయం రోజురోజుకీ ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన YCP నుంచి కరణం వెంకటేశ్, TDP నుంచి కొండయ్య పోటీ పడుతుండగా ప్రచారం కూడా ముమ్మరం చేశారు. అయితే వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో చీరాలలో త్రిముఖ పోటీ తప్పదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చీరాల నుంచి రెండు సార్లు గెలిచిన ఆమంచికి బలమైన కేడర్ ఉన్నా TDP, YCPపై గెలిచేనా?