Prakasam

News April 2, 2024

BREAKING: ఏసీబీ వలలో టంగుటూరు ఎస్ఐ

image

టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి నుంచి రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి రూ.70వేలును ఎస్ఐ నాగేశ్వరరావు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2024

ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బదిలీ

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న పరమేశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన ఎస్పీని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News April 2, 2024

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే..

image

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోటీ చేయబోయే తమ అభ్యర్థలును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీరిలో దర్శి నుంచి కొండారెడ్డి, అద్దంకి నుంచి కిషోర్ బాబు, ఒంగోలు నుంచి రమేశ్ బాబు, కొండపి నుంచి సతీశ్, మార్కాపురం నుంచి షేక్ సైదా, గిద్దలూరు నుంచి పగడాల పెద్ద రంగస్వామి, కనిగిరి నుంచి కదిరి భవాని బరిలో నిలిచారు. ఈ మేరకు పీసీసీ ఛీఫ్ షర్మిలా ప్రకటన విడుదల చేశారు.

News April 2, 2024

అద్దంకి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

image

అద్దంకిలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ముందు వెళ్తున్న ఎక్సెల్ బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అద్దంకి మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన గుదే వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం
బాడీని అద్దంకి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.

News April 2, 2024

ప్రకాశం: అక్కడ వైసీపీ ఖాతా తెరవలేదు

image

జిల్లాలో YCP ఆవిర్భావం నుంచి సాధారణ ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసింది. 2014లో మొత్తం 12 స్థానాలకు గాను 6 చోట్ల.. 2019లో 8 చోట్ల గెలిచింది. పర్చూరు, చీరాలలో YCP ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం చీరాల వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేశ్, TDP నుంచి ఏలూరి సాంబశివ రావు, పర్చూరులో యడం బాలాజీ TDP నుంచి కొండయ్య బరిలో ఉన్నారు. ఈసారి TDP పట్టు నిలుపుకుంటుందా, YCP పైచేయి సాధిస్తుందా అనేది చూడాలి.

News April 2, 2024

అద్దంకి: చికిత్స పొందుతూ యువకుడు మృతి

image

అద్దంకి మండలం కుంకుపాడుకు చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్ గత నెల 19వ తేదీన బైక్‌పై తాళ్లూరు వైపు వెళుతూ కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలవ్వడంతో స్థానికులు 108లో ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ యువకుడు సోమవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 2, 2024

గిద్దలూరు: జనసేన పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు

image

గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆదివారం ఓవర్గం బెల్లంకొండ సాయిబాబునే తమకు ఇన్‌ఛార్జ్‌గా కావాలని అంటుండగా, సోమవారం మరో వర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. జనసేనలో వర్గ విభేదాలు బయటపడటంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

News April 1, 2024

సంతనూతలపాడు ఎమ్మెల్యేకు మాతృవియోగం

image

సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ సోమవారం సాయంత్రం మృతి చెందారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో తూబాడు గ్రామంలోని వారి స్వగృహంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దీంతో టీజేఆర్ సుధాకర్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

News April 1, 2024

ప్రకాశం జిల్లాపై భానుడి ప్రతాపం

image

ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా పీసీపల్లిలో 42.67 డిగ్రీల రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలో 42.40 డిగ్రీలు, మార్కాపురం మండలం దరిమడుగులో 42.30, గుండ్లాపల్లిలో 42.03 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News April 1, 2024

ప్రకాశం జిల్లాలో 83 ఓట్లతో గెలిచిన MLA ఎవరో తెలుసా?

image

మార్కాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో కే.ఎల్.పి అభ్యర్థి రామారెడ్డి 5199 ఓట్లతో గెలుపొందారు. 1978 ఎన్నికల్లో సీపీఐ నుంచి పూలసుబ్బయ్య కేవలం 83 ఓట్ల తేడాతో వి.వి నారాయణ రెడ్డి (జనతా)పై గెలుపొందారు. దీంతో జిల్లాలో తక్కువ ఓట్లతో ఓడిన, గెలిచిన వ్యక్తులుగా వీరిద్దరూ నిలిచారు.