India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్కాపురం MPDO కార్యాలయంలో ఎరువుల నియంత్రణ చట్టంపై వ్యవసాయ సహాయకులకు, డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ S.V.త్రివినాగ్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ఎరువుల కొరత సృష్టిస్తే డీలర్షిప్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను MRP ధరలకే విక్రయించాలని సూచించారు. MRO చిరంజీవి, SI సైదుబాబు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఓపెన్ కేటగిరిలో నాలుగు బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం గురువారం తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తులు అందించాలని చెప్పారు. 15న లాటరీ తీస్తామని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.

జిల్లావ్యాప్తంగా ఓపెన్ కేటగిరిలో నాలుగు బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం గురువారం తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తులు అందించాలని చెప్పారు. 15న లాటరీ తీస్తామని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.

MLA తాటిపర్తి చంద్రశేఖర్ టీడీపీపై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. ‘ఈ రంగు టీడీపీ రంగు కాదా? ఈ ఫొటోలు కూటమి రాజకీయ నేతలవి కాదా? పచ్చకామెర్ల రోగం వచ్చి ఇలా రంగు లేశారని అంటే బాగుంటుందా? మీరు మాపై విమర్శలు చేస్తే పోరాటం అంటారు. మేము మిమ్మల్ని అంటే బూతులు అంటారు, అంతేగా’ అంటూ ప్రశ్నించారు. ఇటీవల మంత్రి లోకేశ్ ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తీసుకెళ్లే వ్యాన్‌ల ఫొటోలను పోస్ట్ చేశారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పల్లె రాజకీయం జోరందుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం మూడు నెలల ముందే నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో జనవరిలోనే ‘పల్లె పోరు’ జరిగే ఛాన్సుంది. జిల్లాలో మొత్తం 730 గ్రామ పంచాయతీలు (సర్పంచ్ స్థానాలు) ఉన్నాయి. 56 జడ్పీటీసీ స్థానాలతో పాటు ఎంపీటీసీలు, ఒంగోలు, కనిగిరి, పొదిలి, దర్శి, మార్కాపురం, అద్దంకి, చీరాల, కందుకూరు తదితర పురపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని వెల్దండ (M) పెద్దాపూర్ శివారులో ఈ దారుణం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు(35) తన ముగ్గురు పిల్లలు మోక్షిత (8), వర్షిని (6), శివ ధర్మ (4)తో కలిసి బైక్‌పై వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు. అయితే, పిల్లల ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ప్రకాశం జిల్లాలోని రైల్వే ప్రయాణికులకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి శుభవార్త చెప్పారు. రైల్వే GMతో బుధవారం జరిగిన సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఎంపీ మాగుంట చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి ఎక్స్ప్రెస్ రైలు దొనకొండ, కురిచేడు రైల్వే స్టేషన్లలో, యశ్వంతపూర్ – మచిలీపట్నం, అమరావతి ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్‌లను దొనకొండ రైల్వే స్టేషన్‌లో నిలుపుదల చేసేందుకు GM అంగీకరించినట్లు MP తెలిపారు.

మాతృ మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా క్వాలిటీ అస్సూరెన్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ఏరియా వైద్యశాలలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు సూచించిన నిబంధనల మేరకు అస్సూరెన్స్ కమిటీ పనిచేయాలని సూచించారు.

ప్రకాశం జిల్లాలోని రైల్వే ప్రయాణికులకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి శుభవార్త చెప్పారు. రైల్వే GMతో బుధవారం జరిగిన సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఎంపీ మాగుంట చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి ఎక్స్ప్రెస్ రైలు దొనకొండ, కురిచేడు రైల్వే స్టేషన్లలో, యశ్వంతపూర్ – మచిలీపట్నం, అమరావతి ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్‌లను దొనకొండ రైల్వే స్టేషన్‌లో నిలుపుదల చేసేందుకు GM అంగీకరించినట్లు MP తెలిపారు.

ప్రకాశం జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం డీఈఓ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు.. తర్లుపాడు ZPHS హెచ్ఎం సుధాకర్, మొగల్లూరు ZPHS స్కూల్ అసిస్టెంట్ సరోజనీ దేవి, పీసీపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఈశ్వరమ్మ, తంగెళ్ల జడ్పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ భాస్కరరావులు ఈనెల 5న అవార్డులను అందుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.