India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సోషల్ మీడియా వేదికగా ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 112/100 నంబర్‌కు గానీ, పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 ద్వారా సమాచారం అందించాలన్నారు.
కనిగిరి మండలం పునుగోడులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు యువకులు మృతి చెందడం పట్ల విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో యువకులు చనిపోవడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం చెల్లిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు.
కనిగిరి మండలంలోని పునుగోడు గ్రామం ఎస్టీ కాలనీ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి నుంచి పునుగోడు గ్రామానికి ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. పునుగోడు ఎస్టీ కాలనీ వద్దకు రాగానే విద్యుత్ వైర్లు తెగి వారు ప్రయాణిస్తున్న బైక్‌పై పడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చీమకుర్తి మండలంలోని మర్రిచెట్లపాలెం, బుధవాడ గ్రామాల వద్ద దెబ్బతిన్న జాతీయ రహదారి రోడ్డును కలెక్టర్ తమిమ్ అన్సారియ మంగళవారం పరిశీలించారు. రోడ్డు మరమ్మతు పనుల ఎస్టిమేషన్, తదితర వివరాలను ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రధాన రహదారి ఒకటైన ఒంగోలు-కర్నూలు జాతీయ రహదారి మరమ్మతు పనులు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రకాశం జిల్లాకు సైతం తగిన ప్రాధాన్యం లభించింది. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామన్న కేంద్రం, విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కాగా జిల్లాకు ఎంత ప్యాకేజీ అనేది తెలియాల్సి ఉంది.
మార్కాపురం ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రామ్ హెడ్ పి. ప్రశాంత్ కిరణ్ తెలిపారు. మార్కాపురం, పరిసర ప్రాంతాల వారై ఉండాలన్నారు. తెలుగు భాషపై పూర్తి అవగాహన, మంచి కంఠస్వరం, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి సమకాలిన రాజకీయ, ఆర్థిక అంశాలపై పట్టు ఉండాలన్నారు. ఆసక్తి గల వారు వచ్చే నెల 5 లోపు తమని సంప్రదించాలన్నారు. రాత, స్వర పరీక్షలతో ముఖాముఖీ ఉంటుందన్నారు.
ఒంగోలులోని త్రిబుల్ ఐటీ కళాశాలలో 24, 25 తేదీలలో ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు త్రిబుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. ప్రవేశాలకు హాజరుకాని విద్యార్థులకు తిరిగి ప్రవేశాలు పొందేందుకు మరోసారి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
బాలికను వేధించిన కేసులో నిందితుడు కటకటాలపాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. చీరాల మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ఫోన్ నంబర్ ఇవ్వమని వేధించాడు. బాలిక తల్లి ఈపూరుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు తెలిపారు.
సంతనూతలపాడు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ దామోదర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి స్టేషన్ ఆవరణలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను పరిశీలించారు. స్టేషన్లోని సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు, శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాల గురించి ఎస్పీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
కొనకనమిట్ల మండలానికి చెందిన 108 వాహనం ఈనెల 10న కనిగిరి మున్సిపాలిటీలోని టకారిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొనగా అతడు మృతి చెందాడు. ఆ అంబులెన్స్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ లేకపోవడంతో కనిగిరి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. జిల్లాలోని పదుల సంఖ్యలో అంబులెన్స్‌లకు ఈ ధ్రువపత్రాలు లేవని పలువురు చెప్తున్నారు.
Sorry, no posts matched your criteria.