Prakasam

News July 17, 2024

సీ.ఎం.ఓ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా మార్కాపురం వాసి

image

మార్కాపురం పట్టణానికి చెందిన తంగిరాల యశ్వంత్ సీఎం కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన జమ్మలమడుగు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన అధికారిగా ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. ఈయన తల్లిదండ్రులు జగన్నాథం, శర్వాణి ఇద్దరూ ఉపాధ్యాయులు కావడం విశేషం.

News July 17, 2024

ఆస్ట్రేలియాలో కందుకూరు యువకుడి మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో చనిపోయిన విషాద ఘటన ఇది. కందుకూరు పట్టణానికి చెందిన చైతన్య(29) గుంటూరులో బీటెక్‌ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్లాడు. గతేడాది వివాహమైంది. చైతన్యతో పాటు బాపట్లకు చెందిన సూర్యతేజ, మరో స్నేహితుడు కలిసి అక్కడి మిల్లామిల్లా జలపాతానికి వెళ్లారు. సూర్యతేజ జలపాతంలోకి జారిపడటంతో అతడిని కాపాడేందుకు చైతన్య దిగారు. ఇద్దరూ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు.

News July 17, 2024

కారంచేడు ఘటనకు 39 ఏళ్లు పూర్తి

image

కారంచేడు ఘటనకు నేటితో 39 ఏళ్లు పూర్తయింది. 1985 జులై 17న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో దేశమంతా కారంచేడు వైపు చూసింది. కారంచేడు అనే ఊరి పేరు ఒక్కసారిగా దేశమంతటా మారుమ్రోగింది. ప్రతి సంవత్సరం జులై 17న చీరాల మండల పరిధిలోని విజయనగర్ కాలనిలో కారంచేడు మృత వీరుల రుధిర క్షేత్రం వద్ద సంస్మరణ సభను పలువురు నిర్వహిస్తారు.

News July 17, 2024

నేడు ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్ బాధ్యతలు

image

ప్రకాశం జిల్లాకు ఎస్పీగా నియమితులైన ఏఆర్ దామోదర్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈయన 2021 నుంచి ఇప్పటి వరకూ ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం పీటీసీ సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

News July 17, 2024

భూసేకరణను వేగంగా చేపట్టాలి: కలెక్టర్ తమీమ్

image

జిల్లాలోని వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో రెవెన్యూ, డివిజనల్ అటవీ శాఖ అధికారులు, ఐటీడీఏ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

News July 17, 2024

తాగునీటి సమస్యకు అత్యంత ప్రాధాన్యత: ప్రకాశం కలెక్టర్

image

జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సాగు, తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

News July 16, 2024

ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తులను కొట్టేశారు: సీఎం

image

ఒంగోలులో పలువురు రూ.101 కోట్లు విలువ చేసే ఆస్తులను కొట్టేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సోమవారం సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో వైసీపీ ప్రభుత్వలో కొందరు నాయకులు, అధికారులు దొంగ పత్రాలు సృష్టించి ప్రభుత్వ, ప్రైవేటు భూములను కాజేశారని చెప్పుకొచ్చారు. వాటి విలువ సుమారు రూ.101కోట్లు ఉంటుందని తెలిపారు. ఇటువంటి వారిని విచారించి కఠిన శిక్షలు పడేలా చేస్తానని పేర్కొన్నారు.

News July 16, 2024

మార్టూరు: రాజుపాలెంలో కత్తితో దాడి

image

మార్టూరు మండలంలోని రాజుపాలెంలో ఓ వ్యక్తి కత్తి దాడికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని తూర్పు కాలనీలో జె. నాగేంద్రబాబు, జె. చిన నాగరాజు మధ్య రేగిన వివాదంలో జె. శ్రీనివాసరావు వారిని విడదీసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో నాగరాజు కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేయడంతో ఎడమ చేతికి గాయమైనట్లు వెల్లడించారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

News July 16, 2024

విచారణ జరిపి సమస్య పరిష్కరిస్తాం: అడిషనల్ ఎస్పీ

image

ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల యొక్క వ్రాతపూర్వక అర్జీలను అడిషనల్ ఎస్పీ స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చట్ట పరిధిలో విచారణ జరిపి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

News July 15, 2024

ప్రకాశం: పోస్టాఫీసులో 89 ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రకాశం డివిజన్‌లో 38, మార్కాపురం డివిజన్‌లో 51 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.