India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రహరీ వివాదంలో మహిళపై గడ్డపారతో దాడిచేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష రూ.200 జరిమానా విధించింది. గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో నరేంద్ర తన స్థలంలో ప్రహరీ నిర్మిస్తుండగా వెంకటసుబ్బయ్య గడ్డపారతో దాడి చేశాడు. పక్కనే ఉన్న నరేంద్ర భార్య రమణమ్మ తలకు తగిలి గాయమైంది. ఈ ఘటనపై గిద్దలూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ అనంతరం జడ్జి మేరీ నిందితునికి ఏడాదిపాటు పాటు శిక్ష విధించారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ను నూతనంగా జిల్లాకు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుమిత్ సునీల్ ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎస్పీ పూల బొకేను అందజేశారు. అనంతరం రాబోయే ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో గల పరిస్థితుల గురించి సుదీర్ఘంగా కలెక్టర్‌తో ఎస్పీ చర్చించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలోకి శనివారం ప్రవేశించనుంది. ఆ యాత్ర ఇలా సాగనుంది. ఉదయం 9 గంటలకు నెల్లూరు జిల్లా కావలిలో సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారని సీఎం ప్రోగ్రాంల కోఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు.
అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందిన 14 మంది వాలంటీర్లు, కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన 7 మంది వాలంటీర్లు శుక్రవారం రాజీనామా చేశారు. అనంతరం వారు అద్దంకిలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డిని కలిసి తమ మద్దతు తెలియజేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సేవలు కొనసాగిస్తామని పలువురు వాలంటీర్లు తెలియజేశారు.
బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మార్టూరు పట్టణంలోని సినీఫక్కీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరుకు వెళుతున్న కారు అతి వేగంతో ముందు వెళుతున్న బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి చిలకలూరిపేటకు చెందిన నల్లజర్ల వేమయ్య (32)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
చీమకుర్తి మండలం బుధవాడ గ్రామంలో నాయర్ పెట్రోల్ బంక్ వద్ద ఓ బైక్‌ను లారీ బలంగా ఢీకొన్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న రామస్వామి తలకు తీవ్ర గాయాలు కాగా, షేక్ రసూల్ కాలు విరిగింది. స్థానికులు వెంటనే 108 సహాయంతో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ నియోజకవర్గంలో క్రియాశీలక పాత్రను పోషించారు. వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో శుక్రవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎక్కడి నుంచి బరిలో నిలిచిన పోటాపోటీ తప్పదని పలువురు భావిస్తున్నారు.
గిద్దలూరు MLA అన్నా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాసప్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో కార్యకర్తలకు స్థానిక కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆర్.సంతోష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
సంతమాగులూరు మండలం పుట్ట వారిపాలెం గ్రామంలోని ప్రమీల సీడ్స్ యజమాని చిరుమామిళ్ల సురేంద్ర గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం దుకాణానికి వచ్చిన సురేంద్ర పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇది గమనించిన షాపులోని గుమస్తా బాధితుడిని హుటాహుటీన నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సురేంద్రకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రకాశం జిల్లా ఎస్పీగా 2015 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సుమిత్ సునీల్ ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 8 గంటలలోపు విధుల్లోకి చేరాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.