Prakasam

News March 26, 2024

కందుకూరు: ఆటో, ట్రాక్టర్ ఢీ..ఒకరు మృతి

image

మోపాడు సమీపంలో ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. కందుకూరు పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కూలీలు ఆటోలో కూలి పనులకు వెళ్తుండగా మోపాడు సమీపంలో పొగాకు చెక్కలు లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ప్రమాదంలో డాల లక్ష్మమ్మ మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News March 26, 2024

ప్రకాశం : చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు

image

చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పు జరిగింది. తొలుత ఈ నెల 31న మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాలలో ప్రజాగళం పేరుతో పర్యటించనున్నారని ప్రకటించగా ..తాజా షెడ్యూలు ప్రకారం చంద్రబాబు కార్యక్రమం మార్కాపురం వరకే పరిమితం కానుంది. ఆ రోజు ఉదయం నెల్లూరు జిల్లా కావలిలో జరిగే సభలో పాల్గొని అనంతరం చంద్రబాబు హెలికాఫ్టర్లో మార్కాపురం చేరుకొని సభలో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

News March 26, 2024

చీరాల : వివాహిత హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

image

చీరాల మండలం కీర్తి వారిపాలెంలో స్థల వివాదం కారణంగా చోటు చేసుకున్న ఎలికా జ్యోతి అనే వివాహిత హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. మృతురాలి మరణ వాంగ్మూలం, బంధువుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసేమన్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను చీరాల మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.

News March 25, 2024

ప్రకాశం: PHOTO OF THE DAY ❤

image

అద్దంకి మండలంలోని సింగరకొండ పుణ్యక్షేత్రం వార్షిక తిరునాళ్ల సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ప్రసన్నాంజనేయ స్వామి, కొండమీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎన్నికల కోడ్ వల్ల రాజకీయ పార్టీల నేతలు ప్రభలు కట్టనప్పటికీ ఆలయం తరఫున ఒక ప్రభను ఏర్పాటు చేశారు. రాత్రికి విద్యుత్ దీపకాంతులతో సింగరకొండ పుణ్యక్షేత్రం ధగధగలాడుతోంది.

News March 25, 2024

కందుకూరులో వివాహిత దారుణ హత్య

image

కందుకూరు పట్టణంలో సోమవారం వివాహిత దారుణ హత్యకు గురైంది. గాయత్రీ నగర్‌లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న వనజాక్షి(27) ఇంట్లో రక్తపు మడుగులో చనిపోయి ఉంది. కుమార్తెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిన వనజాక్షి తండ్రికి ఆమె శవమై కనిపించింది. వనజాక్షి భర్తే హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ నఫీస్ బాషా కేసు దర్యాప్తు చేపట్టారు.

News March 25, 2024

‘ఆమంచికే చీరాల టికెట్ ఇవ్వండి’

image

రోజురోజుకు చీరాల రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కి వైసీపీ చీరాల టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై సోమవారం చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి ఆమంచికి మద్దతు కూడగట్టారు. ఇప్పటికే వైసీపీ చీరాల అభ్యర్థిగా కరణం వెంకటేశ్‌ ఖరారయ్యారు. దీంతో ఆమంచి స్థానికుడని.. ఆయనకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను ఇప్పుడు తెపైకి తెస్తున్నారు.

News March 25, 2024

ఉత్కంఠ రేపుతున్న మహిధర్ రెడ్డి మౌనం

image

YCP టిక్కెట్ చేజారిన నేపథ్యంలో కందుకూరు MLA మానుగుంట మహిధర్ రెడ్డి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. BJP.. లేదా TDP అభ్యర్ధిగా పోటీ చేసి YCPకి ఝలక్ ఇస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇటు YCPకి మద్దతూ తెలపలేదు. MP అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ మహీధర్ రెడ్డిని కలిసి మద్దతు కోరినప్పటికీ నిర్ణయం మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.

News March 25, 2024

గుడ్లూరులో అగ్ని ప్రమాదం

image

గుడ్లూరు మండలం చిన్నలాటిరఫీలో మల్యాద్రి అనే రైతుకు చెందిన వరిగడ్డి వాము దగ్ధమైంది. ప్రమాదవశాత్తు వరి గడ్డి వాముపై నిప్పు రవ్వలు పడడంతో పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్ వచ్చేలోగా వరిగడ్డి వాము మొత్తం కాలిపోయింది. సుమారు రూ.25 వేలు విలువైన వరిగడ్డివాము దగ్ధమైందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 25, 2024

సంతనూతలపాడు: ఐదుగురు వాలంటీర్లు రాజీనామా

image

సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగు నాగార్జునకు మద్దతుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు వాలంటీర్లు ఆదివారం తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదనే ఎన్నికల కమిషన్ చెప్పడంతో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడానికి తాము రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే తమ రాజీనామాలను ఎంపీడీవోకు అందజేయకుండా నాగార్జునకు అందజేయడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.

News March 25, 2024

ప్రకాశం: సముద్ర స్నానానికి వచ్చి వ్యక్తి దుర్మరణం

image

సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు లోపలకు కొట్టుకుపోయి వ్యక్తి దుర్మరణం పాలయిన సంఘటన వాడరేవులో ఆదివారం చోటు చేసుకుంది. మెరైన్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కారంచేడు మండలం తిమిడిదపాడు గ్రామానికి చెందిన రాజేశ్ దావీదు (25) ఆదివారం కుటుంబ సభ్యులతో సముద్ర స్నానానికి వెళ్లారు. రాజేశ్ కాళ్లు కడుక్కుని వస్తానని చెప్పి లోపలికి వెళ్లాడే. అలల తాకిడికి ఆయన లోపలకు కొట్టుకుపోయి మృతి చెందాడు.