India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాతృమూర్తి తలతోటి అన్నమ్మ సోమవారం సాయంత్రం మృతి చెందారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో తూబాడు గ్రామంలోని వారి స్వగృహంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దీంతో టీజేఆర్ సుధాకర్ బాబు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా పీసీపల్లిలో 42.67 డిగ్రీల రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలో 42.40 డిగ్రీలు, మార్కాపురం మండలం దరిమడుగులో 42.30, గుండ్లాపల్లిలో 42.03 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్కాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో కే.ఎల్.పి అభ్యర్థి రామారెడ్డి 5199 ఓట్లతో గెలుపొందారు. 1978 ఎన్నికల్లో సీపీఐ నుంచి పూలసుబ్బయ్య కేవలం 83 ఓట్ల తేడాతో వి.వి నారాయణ రెడ్డి (జనతా)పై గెలుపొందారు. దీంతో జిల్లాలో తక్కువ ఓట్లతో ఓడిన, గెలిచిన వ్యక్తులుగా వీరిద్దరూ నిలిచారు.
J. పంగులూరు మండలంలోని చందలూరు గ్రామ పంచాయతీకి ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ పంచాయతీ సుమారు రూ.1,10,00,000 వరకు బకాయి ఉంది. గ్రామ పంచాయతీకి విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులలో 20 శాతం విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లిస్తామని అధికారులకు చెప్పినా.. సరఫరా నిలిపివేశారని సర్పంచ్ పెంట్యాల కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటి పన్నుల వసూళ్లలో అద్దంకి మున్సిపాలిటీ బాపట్ల జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4.55 కోట్ల వసూలు లక్ష్యం కాగా ఆదివారం నాటికి రూ.3.72 కోట్లు వసూలు చేసినట్టు చెప్పారు. జిల్లాలో 81.80 శాతం వసూళ్లతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు.
నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో ఆదివారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన భార్యభర్తలు గత కొద్దిరోజులుగా హనుమాన్ నగర్ 13వ లైన్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై వేడి నీరు పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు వాపోయాడు. కేసు నమోదైంది.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నా, ఫిర్యాదులు ఉన్న వెంటనే తెలిపేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.
ఒంగోలు -08592-288099, సంతనూతలపాడు-08592-273100, కొండపి -085982-94717, దర్శి -8639370180, మార్కాపురం-9281034442, గిద్దలూరు -8639483409, ఎర్రగొండపాలెం- 6281735787, జిల్లా సీసీఆర్-08692-288599.
కొండపి మండలంలోని నేతివారిపాలెం సాయిబాబా గుడి వద్ద ప్రమాదం జరిగింది. చీమకుర్తి మండలానికి చెందిన ఇద్దరు యువకులు జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ గుడికి బైక్‌పై వెళ్లి వస్తూ మద్యం మత్తులో చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో రాగం చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలుకు తరలించారు. ఘటనా స్థలాన్ని కొండపి ఎస్సై కృష్ణబాజీ పరిశీలించారు.
మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కాపురంలో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురానికి నీళ్లు, నియామకాలతో పాటు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే సంపద సృష్టిస్తూ.. సంక్షేమాన్ని ఇస్తానని తెలిపారు. ‘సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలా.. గంజాయి తెచ్చే ముఖ్యమంత్రి కావాలా’ అని ప్రజలను అడిగారు.
గిద్దలూరు ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో 12 వేలకు వైగా ఓట్లతో గెలిచారు. అటు వైసీపీ నుంచి మార్కాపురం MLA కుందూరు నాగార్జునరెడ్డి గిద్దలూరు బరిలో ఉన్నారు. స్థానికులకే పట్టం కట్టాలని టీడీపీ ప్రచారం చేస్తుంటే, ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తానని కేపీ అంటున్నారు. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.