India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చీరాల మండలం కీర్తి వారిపాలెంలో స్థల వివాదం కారణంగా చోటు చేసుకున్న ఎలికా జ్యోతి అనే వివాహిత హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. మృతురాలి మరణ వాంగ్మూలం, బంధువుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసేమన్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను చీరాల మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
అద్దంకి మండలంలోని సింగరకొండ పుణ్యక్షేత్రం వార్షిక తిరునాళ్ల సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ప్రసన్నాంజనేయ స్వామి, కొండమీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎన్నికల కోడ్ వల్ల రాజకీయ పార్టీల నేతలు ప్రభలు కట్టనప్పటికీ ఆలయం తరఫున ఒక ప్రభను ఏర్పాటు చేశారు. రాత్రికి విద్యుత్ దీపకాంతులతో సింగరకొండ పుణ్యక్షేత్రం ధగధగలాడుతోంది.
కందుకూరు పట్టణంలో సోమవారం వివాహిత దారుణ హత్యకు గురైంది. గాయత్రీ నగర్‌లో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న వనజాక్షి(27) ఇంట్లో రక్తపు మడుగులో చనిపోయి ఉంది. కుమార్తెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్ళిన వనజాక్షి తండ్రికి ఆమె శవమై కనిపించింది. వనజాక్షి భర్తే హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ నఫీస్ బాషా కేసు దర్యాప్తు చేపట్టారు.
రోజురోజుకు చీరాల రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కి వైసీపీ చీరాల టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై సోమవారం చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి ఆమంచికి మద్దతు కూడగట్టారు. ఇప్పటికే వైసీపీ చీరాల అభ్యర్థిగా కరణం వెంకటేశ్ ఖరారయ్యారు. దీంతో ఆమంచి స్థానికుడని.. ఆయనకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను ఇప్పుడు తెపైకి తెస్తున్నారు.
YCP టిక్కెట్ చేజారిన నేపథ్యంలో కందుకూరు MLA మానుగుంట మహిధర్ రెడ్డి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. BJP.. లేదా TDP అభ్యర్ధిగా పోటీ చేసి YCPకి ఝలక్ ఇస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇటు YCPకి మద్దతూ తెలపలేదు. MP అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ మహీధర్ రెడ్డిని కలిసి మద్దతు కోరినప్పటికీ నిర్ణయం మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.
గుడ్లూరు మండలం చిన్నలాటిరఫీలో మల్యాద్రి అనే రైతుకు చెందిన వరిగడ్డి వాము దగ్ధమైంది. ప్రమాదవశాత్తు వరి గడ్డి వాముపై నిప్పు రవ్వలు పడడంతో పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్ వచ్చేలోగా వరిగడ్డి వాము మొత్తం కాలిపోయింది. సుమారు రూ.25 వేలు విలువైన వరిగడ్డివాము దగ్ధమైందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరుగు నాగార్జునకు మద్దతుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు వాలంటీర్లు ఆదివారం తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదనే ఎన్నికల కమిషన్ చెప్పడంతో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడానికి తాము రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే తమ రాజీనామాలను ఎంపీడీవోకు అందజేయకుండా నాగార్జునకు అందజేయడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేశారు.
సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు లోపలకు కొట్టుకుపోయి వ్యక్తి దుర్మరణం పాలయిన సంఘటన వాడరేవులో ఆదివారం చోటు చేసుకుంది. మెరైన్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. కారంచేడు మండలం తిమిడిదపాడు గ్రామానికి చెందిన రాజేశ్ దావీదు (25) ఆదివారం కుటుంబ సభ్యులతో సముద్ర స్నానానికి వెళ్లారు. రాజేశ్ కాళ్లు కడుక్కుని వస్తానని చెప్పి లోపలికి వెళ్లాడే. అలల తాకిడికి ఆయన లోపలకు కొట్టుకుపోయి మృతి చెందాడు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తయింది. కూటమి నుంచి ఒక్క దర్శి మినహా. దీనికి ప్రధానం కారణం పొత్తులో ఇక్కడ ఏ పార్టీకి సీటు కేటాయించాలన్నది పెను సవాలుగా మారింది. అటు టీడీపీ నుంచి బాచిన కృష్ణ చైతన్య, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు పోటీలో ఉండగా, జనసేన నుంచి గరికపాటి వెంకట్ టికెట్ ఆశిస్తున్నాడు. దీంతో ఎవరికీ సీటు ఇచ్చి ఎవరిని బుజ్జగిస్తారో అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది.
ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై వ్యక్తి బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన కొప్పరపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. కొప్పరపాలెంలో ఓ వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన వల్లెపు నాగేశ్వరరావు కత్తితో బెదిరించి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ఎదురు తిరిగి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చేసరికి పారిపోయాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.