India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో రెవెన్యూ, డివిజనల్ అటవీ శాఖ అధికారులు, ఐటీడీఏ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సాగు, తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఒంగోలులో పలువురు రూ.101 కోట్లు విలువ చేసే ఆస్తులను కొట్టేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సోమవారం సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో వైసీపీ ప్రభుత్వలో కొందరు నాయకులు, అధికారులు దొంగ పత్రాలు సృష్టించి ప్రభుత్వ, ప్రైవేటు భూములను కాజేశారని చెప్పుకొచ్చారు. వాటి విలువ సుమారు రూ.101కోట్లు ఉంటుందని తెలిపారు. ఇటువంటి వారిని విచారించి కఠిన శిక్షలు పడేలా చేస్తానని పేర్కొన్నారు.
మార్టూరు మండలంలోని రాజుపాలెంలో ఓ వ్యక్తి కత్తి దాడికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని తూర్పు కాలనీలో జె. నాగేంద్రబాబు, జె. చిన నాగరాజు మధ్య రేగిన వివాదంలో జె. శ్రీనివాసరావు వారిని విడదీసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో నాగరాజు కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేయడంతో ఎడమ చేతికి గాయమైనట్లు వెల్లడించారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల యొక్క వ్రాతపూర్వక అర్జీలను అడిషనల్ ఎస్పీ స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చట్ట పరిధిలో విచారణ జరిపి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రకాశం డివిజన్‌లో 38, మార్కాపురం డివిజన్‌లో 51 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
హైదరాబాద్ నుంచి పొదిలికి వస్తున్న ఆర్టీసీ బస్సులో నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఆదివారం ‘పొదిలి బస్సులోకి నీళ్లు’ అని Way2Newsలో <<13630523>>ఓ కథనం<<>> ప్రచురితమైంది. ఈ ఘటనపై APSRTC యాజమాన్యం స్పందించింది. ‘ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి క్షమించండి.. త్వరగా సమస్య పైన చర్యలు తీసుకుంటామని’ ‘X’లో పోస్ట్ చేశారు.
వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిపై స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. జిల్లాలో వైసీపీ ఘోర ఓటమి చెందడంతో ఆ భారీ ప్రక్షాళన చేయబోతోందని సమాచారం. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్.
దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎద్దేవ చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఇసుక ధరలకు మీ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదని ఆగ్రహించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి బాలనేని ఓటమి తర్వాత ఇవాళ ఒంగోలుకు వస్తున్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని పలు మార్లు ప్రచారంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయంపై నియోజకవర్గం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ జయంతిన చాలా మంది కార్పొరేటర్లు దూరంగా ఉండటం కూడా నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
Sorry, no posts matched your criteria.