Prakasam

News July 14, 2024

మార్టూరు: బాలుడి కిడ్నాప్ అవాస్తవం: సీఐ

image

మార్టూరులో బాలుడి కిడ్నాప్‌కి యత్నం అంటూ వచ్చిన వార్తలను ఆదివారం సీఐ రాజశేఖర్‌రెడ్డి ఖండించారు. అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నారు. ఆ బాలుడు బయటకు వెళ్ళి కొద్ది సేపు ఇంటికి తిరిగి రాలేదని తెలిపారు. అతడు ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించి, మందలిస్తారనే భయంతో ఆ బాలుడు కిడ్నాప్ కథ చెప్పాడన్నారు. అయితే కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలు ప్రచురించాయని సీఐ మండిపడ్డారు.

News July 14, 2024

చినగంజాం: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి

image

సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. చినగంజాంకు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ కంపిరి సురేశ్‌కు ఇద్దరు కూమారులు. పెద్దవాడు అనిల్ గంజాయికి బానిసై డబ్బు ఇవ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరించేవాడు. అన్న తల్లిదండ్రులను చంపేస్తాడని భావించిన తమ్ముడు అఖిల్ స్నేహితులతో కలిసి ఈనెల 5న పెనుగంజిప్రోలు వద్ద అన్నకు మద్యం తాగించి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు.

News July 13, 2024

ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్

image

ఏపీలో భారీగా ఎస్పీలు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గరుడ్ సుమిత్ సునీల్‌ను బదిలీ చేస్తూ శనివారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను DGP ఆఫీసులో రిపోర్టింగ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సునీల్ స్థానంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్ ‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

News July 13, 2024

ఒంగోలు: విద్యార్థులు మొక్కలు నాటాలి: డీఈవో

image

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డీఈవో డి.సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా చేపట్టిన ఏక్ పేడ్ మాకౌనామ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జియోటాగ్ ఫొటోలను గ్రూపులో పెట్టాలన్నారు.

News July 13, 2024

ప్రకాశం: వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితా

image

స్కాలర్షిప్ కోసం 2023 డిసెంబర్ 3న జరిగిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారి జాబితా ప్రకాశం వెబ్సైట్ లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్సైట్ నుంచి వారి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే NMMS అధికారిక పోర్టల్‌లో ఆగస్టు 31 లోగా అప్లోడ్ చేయాలన్నారు.

News July 13, 2024

ఎవరైనా గంజాయి అమ్మితే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి: ఎస్పీ

image

అమాయక విద్యార్థులు, యువకులకు గంజాయి విక్రయించే వారికి జైలు శిక్ష తప్పదని ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ హెచ్చరించారు. ఒంగోలులో SP మాట్లాడుతూ.. జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం ద్వారా 25 మందిని అరెస్టు చేసి వారి నుంచి 8.91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 14500కు తెలియజేయాలని కోరారు. SHAREit

News July 13, 2024

కొండపి: కాలువలోకి దూసుకెళ్లిన అంబులెన్స్‌

image

అదుపుతప్పి అంబులెన్స్‌ కాలువలోకి దూసుకెళ్లి నీటిలో మునిగిన ఘటన సింగరాయకొండ మండల పరిధిలోని పెరల్‌ డిస్టిలరీ సమీపంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌ పేషెంట్‌ను తీసుకొచ్చి తిరిగి వెళ్తోంది. పెరల్‌ డిస్టిలరీ సమీపంలోకి రాగానే అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు.

News July 13, 2024

కొండేపి: పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.356

image

కొండేపి పొగాకు వేలం కేంద్రానికి నాణ్యమైన బేళ్లు తీసుకొచ్చి అధిక ధరలు పొందాలని వేలం నిర్వహణాధికారి సునీల్ కుమార్ సూచించారు. స్థానికుల పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం జరిగిన వేలంలో పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.356 పలికిందని తెలిపారు. రైతులు 1174 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 1112 కొనుగోలయ్యాయి. కనిష్ఠ ధర కేజీ రూ.205, సరాసరి ధర రూ.282. 72 పలికిందన్నారు.

News July 12, 2024

ANU: డిగ్రీ 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ చదువుతున్న విద్యార్థులు, రాయాల్సిన 7వ సెమిస్టర్ (Y20 బ్యాచ్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 1, 2, 3, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 12, 2024

చీరాల: IIITలో టాప్ లేపిన ఈపూరుపాలెం గర్ల్స్ హైస్కూల్

image

చీరాల మండలం ఈపూరుపాలెం జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌లో 10 మంది IIITలో సీట్లు సాధించారు. చీరాల డివిజన్‌లో అత్యధికంగా IIIT సీట్లు సాధించిన హైస్కూల్ ఇదే కావటం విశేషం. విద్యార్థులను శుక్రవారం స్కూల్లో జరిగిన సభలో హెచ్ఎం అనోరా, ఉపాధ్యాయ బృందం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అభినందించారు. ఇలాగే కష్టపడి స్కూల్‌కు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు హెచ్‌ఎం సూచించారు.