India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల వివరాలను అందజేస్తే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని కనిపెడుతున్నామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దొంగిలించిన, పోగొట్టుకున్న 361 మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు.
మూడో రైల్వేలైను నిర్మాణంలో భాగంగా విజయవాడ-గూడూరు సెక్షన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా చీరాల మీదుగా వెళ్లే పలు రైళ్లను ఈనెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గూడూరు-విజయవాడ మధ్య మెమో రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. చార్మినార్, కృష్ణా తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని, పూర్తి వివరాలను రైల్వేస్టేషన్లో తెలుసుకోవాలన్నారు.
ఒంగోలులోని శ్రీనివాస కాలనీకి చెందిన మహిళా కూలీ బొమ్మనబోయిన అల్లూరమ్మ (35) గత ఆరు నెలలుగా నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో పనిచేస్తున్నారు. గురువారం నాలుగో అంతస్థులో పిల్లర్ బాక్సులు ఊడదీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి పడి పోయారు. తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు.
సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని డీఈవో సుభద్ర చెప్పారు. సీఎంవో, ఐఈసీవో, ఏ ఎల్ఎస్సీవో, ఏఎస్వీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్కూలు అసిస్టెంట్లను ఫారిన్ సర్వీసుపై నియమిస్తారు. జడ్పీ, మునిసిపల్ యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూలు అసిస్టెంట్లు పోస్టులకు అర్హులన్నారు. ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.
చీరాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఈశ్వర్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, గురువారం అరెస్టు చేసినట్లు ఈపూరుపాలెం పోలీసులు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరు పర్చగా.. రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
సాగుకు అవసరమైన ఇన్‌పుట్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గురువారం వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సాగు వివరాలు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగు పద్ధతులు, ప్రభుత్వం నుంచి అందిస్తున్న ఇన్‌పుట్స్‌ను సరఫరా, దిగుబడి లక్ష్యాలు, ప్రభుత్వ పథకాలు రైతులకు అందుతున్న తీరుపై కలెక్టర్ ఆరా తీశారు.
విజయవాడలోని వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి స్వామి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలును పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 నుంచి 29 వరకు నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ BA, BCom, BSc, BCA పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సంధ్యా కోల్ విడుదల చేశారు. మొత్తం 14,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 8,439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చన్నారు.
రైల్వే లైన్మెన్ వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. పెదరికట్లకు చెందిన చల్లా వెంకటేశ్వర్లు అమ్మనబ్రోలు రైల్వే గేట్మెన్‌గా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి 11:17 గంటల సమయంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తున్న సమయంలో పట్టాల మధ్య గ్యాప్‌ని గమనించి రెడ్ లైట్ వేశారు. దీంతో లోకో పైలట్ సమస్యను ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్లారు. వెంకటేశ్వర్లు సమయస్ఫూర్తిని మెచ్చి గురువారం సన్మానమిచ్చారు.
ఒంగోలు మండలంలోని తృవగుంట హరిజనవాడలో దారుణం చోటుచేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన భర్త, భార్య నాగలక్ష్మిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు. బుధవారం రాత్రి కత్తితో నాగలక్ష్మి గొంతు కోస్తుండగా ఆమె పెద్దగా అరవడంతో భర్త పరారయ్యాడు. దీంతో అకస్మారక స్థితిలో ఉన్న నాగలక్ష్మిని కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.