Prakasam

News July 11, 2024

డెంగ్యూ వ్యాధిపై ప్రకాశం కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ తమీమ్ అన్సారియా డెంగ్యూ మాసోత్సవంపై బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ డెంగ్యూ కేసులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పనిచేస్తున్న ఎ.ఎన్.ఎంలు విధిగా వారికి కేటాయించిన ఇండ్లను సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను నమోదు చేయాలన్నారు.

News July 10, 2024

జగన్‌‌ను కలిసిన ప్రకాశం జిల్లా YCP కీలక నేతలు

image

గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కేపి.నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి బుధవారం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓటమితో ఎవరు అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రజా సమస్యలపై పోరాడాలని జగన్ వారికి సూచించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని జగన్ చెప్పారన్నారు.

News July 10, 2024

ప్రకాశం: ఇంటర్ పాసైన వారికి సర్టిఫికెట్లు సిద్ధం

image

2024లో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నాయని ఆర్ఐఓ ఎ.సైమన్ విక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు మార్చి, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఉత్తీర్ణత సర్టిఫికెట్లను బుధవారం ఉదయం ఆర్ఐవో కార్యాలయం నుంచి తీసుకెళ్లాలన్నారు. వాటిని తిరిగి విద్యార్థులకు పంపిణీ చేయాలన్నారు.

News July 10, 2024

ప్రకాశం జిల్లాలో విషాదం

image

నరసరావుపేట హైవేపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పెద్దారవీడు మండలం రామాయపాలెంకు చెందిన రమణ గౌడ్ (28), భార్యతో అత్తారింటికి బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం వీరిని ఢీ కొట్టటంతో రమణ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకి గాయాలయ్యాయి. కాగా వీరికి పెళ్లి అయి ఏడాది గడవకముందే రమణ మృతి చెందాడని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News July 10, 2024

కంభం: పది రోజుల్లో ముగ్గురు మృతి

image

జంగంగుంట్ల- కంభం హైవే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉందని వాహనదారులు అంటున్నారు. గత పది రోజుల్లో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు తీవ్రగాయాల బారిన పడ్డారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం, రోడ్డు వెడల్పు తక్కువ, మలుపులు వంటివి ప్రమాదాలకు కారణాలుగా తెలుస్తోంది. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.

News July 10, 2024

అద్దంకి: భార్యాభర్తల నడుమ వివాదం.. ఇంట్లో చోరీ

image

బల్లికురవ మండలంలోని కొప్పరపాలెంలో రెండు రోజుల నుంచి భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తోంది. ఈక్రమంలో వారి కుటుంబ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడికి యత్నించారు. భార్య బంధువులు మంగళవారం ఉదయం భర్త ఇంటిపై దాడి చేశారు. భర్తతో పాటు మరో వ్యక్తిపై దాడి చేసి బీరువాలో ఉన్ననగదును ఎత్తుకెళ్లినట్లుగా చెప్పాడు. భయభ్రాంతులకు గురైన వారు బల్లికురవ పోలీసులను ఆశ్రయించగా, ఘటనపై విచారణ చేపట్టారు.

News July 10, 2024

విద్యా శాఖ అధికారులతో ప్రకాశం కలెక్టర్ సమీక్ష

image

విద్యా సంవత్సరం మొదలైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, పాఠ్య పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యాశాఖ అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్షించారు. అకడమిక్, విద్యాలయాలలో చేపడుతున్న నిర్మాణాలు, ఎడ్యుకేషన్ కార్యకలాపాలతో పాటు వివిధ యాజమాన్యాల క్రింద ఉన్న పాఠశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News July 9, 2024

ప్రకాశం: వారంలో రెండు రోజులే అనుమతి

image

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో దద్దనాల ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి ఎంతోమంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయానికి మంగళ, శనివారం మాత్రమే ప్రజలను అనుమతిస్తామని కొలుకుల సెక్షన్ ఫారెస్ట్ అధికారి వెల్లడించారు. ఈ మేరకు శాంతినగర్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బైకుకు రూ.50, నాలుగు చక్రాల వాహనాలకు రూ.100 వసూళ్లు చేస్తామని తెలిపారు.

News July 9, 2024

ఒంగోలు మీదగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

మూడో కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలోని ఒంగోలు మీదగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. (07500)విజయవాడ-గూడూరు, (12743/44)విజయవాడ-గూడూరు వెళ్లే ఈ రైళ్లను 15 నుంచి 30 వరకు, (07576) ఒంగోలు-విజయవాడ, (07461) విజయవాడ-ఒంగోలు వెళ్లే రైళ్లను 16 నుంచి 30 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 9, 2024

మార్కాపురం ఎమ్మెల్యేకు ఆపరేషన్

image

మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి హైదరాబాద్‌లో సోమవారం ఆపరేషన్ చేశారు. చిన్నపాటి సమస్య ఉండటంతో ఆయన తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ మంగళవారం ఆసుపత్రికి వెళ్లి నారాయణ రెడ్డిని పరామర్శించారు. త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షించారు.