India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అగ్నివీర్ వాయు భారత సైన్యంలోకి చేరడానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత వైమానిక దళం అధికారి సందీప్ తెలిపారు. అగ్నివీర్ వాయు అనుబంధ శాఖల అధికారులతో శనివారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. భారత సైన్యంలోకి యువకులు చేరడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ నెల 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సంతమాగులూరు మం, గురిజేపల్లిలో మార్చి 7న జరిగిన హత్య కేసును పోలీసులు చేదించారు. వారి వివరాల మేరకు.. మేడబోయిన ఆంజనేయులు గొర్రెల వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో రావులపల్లి నాగప్రసాద్ పరిచయమయ్యాడు. అప్పుల పాలయిన ప్రసాద్, ఆంజనేయులు వద్ద ఉన్న రూ.3 లక్షలను కాజేయాలని పన్నాగం పన్నాడు. దీంతో కరివేపాకు తోటలోకి తీసుకెళ్లి పూటుగా మద్యం తాగించి, హత్య చేసి నగదును ఎత్తుకెళ్లాడు. పోలీసుల దర్యాప్తులో విషయం బయట పడింది.
పొదిలిలో శనివారం విషాద ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శి రోడ్డులోని SSR అపార్ట్‌మెంటులో మంచినీటి ట్యాంకును పలువురు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు సుబ్బయ్య అనే వ్యక్తి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీ హైకోర్టులో ప్రభుత్వ సహాయ ప్లీడర్లుగా (AGP) ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అహమ్మద్, కొల్లూరి అర్జున్ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 3వ తేదీ జీవో జారీ చేయగా వారు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వారు.. చిన్న వయసులోనే AGPగా హైకోర్టుకు ఎంపిక కావడంపై జిల్లా వాసులు, తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పోలేరమ్మ దేవస్థానం ఎదురుగా ఓయువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. బాపట్ల జిల్లాకు చెందిన గోపి (35), లక్ష్మీ అనే మహిళతో సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల లక్ష్మీ వేరే వ్యక్తితో చనువుగా ఉండడంతో గొడవలు జరుగుతున్నాయి. అక్రమసంబంధాల కారణంగా గోపి హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒంగోలులో ఓ యువకుడిపై పలువురు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసి, గొంతుకు తాడు బిగించి హత్యయత్నానికి పాల్పడ్డారు. గ్యాస్ డెలివరీ బాయ్ డేనియల్ సన్నిహితంగా ఉంటున్న యువతి ఇంటికి బుధవారం రాత్రి మద్యం తాగి వెళ్లాడు. అక్కడ యువతి సంబంధీకులు ఆ యువకుడిని కొట్టినట్లు తెలుస్తోంది. యువతి ఇంటిముందు అతడు గాయాలతో ఉండటాన్ని గమనించిన స్థానికులు డానియల్ తల్లికి సమాచారం అందించి ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.
గుడికి వెళ్లేందుకు ఇతరులను బైక్ అడిగేందుకు భార్య నిరాకరించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముండ్లమూరు మండలం నాయుడుపాలేంలో జరిగింది. బద్రి శ్రీకాంత్(34) భార్యతో కలిసి శింగనకొండ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భర్త భార్యను గుడికి వెళ్లడానికి ఎవరినైనా బైక్ అడగమని అడగ్గా.. భార్య నిరాకరించి బస్సులో వెళ్దామంది. దీంతో మనస్తాపానికి గురై విష రసాయనం తాగి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
మండలంలోని నాయుడుపాలెం గ్రామానికి చెందిన బద్రి శ్రీకాంత్ రెడ్డి ఎలుకల మందు తిని మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం పోలవరం సమీపంలో రేకుల షెడ్డులో ఎలుకలో మందు తిని అపస్మారస్థితిలో వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్యపై కోపంతో కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా, టీపీ గూడూరులో జరిగింది. నెల్లూరు ఇన్ ఛార్జ్ డీఎస్పీ డి. శ్రీనివాస రెడ్డి వివరాల మేరకు టీపీ గూడూరుకు చెందిన మహిళ కనిగిరికి చెందిన కె.మల్లిఖార్జునను రెండో పెళ్లి చేసుకుంది. వీరి మధ్య విబేధాలు రావడంతో గతనెల 29న తన భార్య కుమార్తెను బట్టలు కొనిస్తానని చెప్పి బాలికను బైక్‌పై అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మండలంలోని వెలగలవారిపాలెంలో ఇటీవల టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చించివేసిన ఘటనపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెలుగు లక్ష్మయ్య వర్గీయులు బొద్దికూరపాడు రహదారివైపు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఇద్దరు వ్యక్తులు దాన్ని చింపేయగా లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.