India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానం చేసే పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులకు అర్హత కలిగిన వారు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విశిష్ట సేవలు అందించిన వారు తమ వివరాలను వెబ్‌సైట్లో నమోదు చేసుకొని, ఆ దరఖాస్తును జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జులై 5లోపు ధ్రువీకరణ పత్రాలతో సమర్పించాలన్నారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సారియా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమీమ్ అన్సారియా గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ డైరెక్టర్ గా, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. కొత్త కలెక్టర్ కు జిల్లాలో నీటి ఎద్దడి, కరవు లాంటి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వీటిని అధిగమించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.ఎస్.దినేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్‌గా తమీమ్ అన్సారియాను ప్రభుత్వం నియమించింది.
ఒంగోలులోని స్పందన హాలు, కలెక్టర్ ఆఫీసు కార్యాలయాలలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు “మీకోసం” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలు తమ సమస్యలను అధికారులకు అర్జీల ద్వారా తెలియచేయ వచ్చునని పేర్కొన్నారు. అధికారులు సదరు కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 40వేల 336 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై రెండో సంతకం చేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్ పథకంపై మూడో సంతకం చేశారు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో శుక్రవారం రాకాసి అలల తాకిడికి గల్లంతైన మరో ఇద్దరు యువకుల మృతదేహాలు శనివారం ఉదయం వాడరేవు వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. మొత్తం నలుగురు యువకులు గల్లంతు కాగా శుక్రవారం సాయంత్రమే రెండు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురావడం తెలిసిందే. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాల వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు లాంఛనాలు పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
నిన్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ ఒక్కరే ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. మిగతా 11 మంది తెలుగులో చేశారు. వీరందరితో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి దైవసాక్షిగా ప్రమాణం చేయించారు.
జిల్లాలో ఇసుక నిల్వలను మైన్స్ శాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ప్రస్తుతం 44 వేల టన్నుల నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, జరుగుమల్లిలో ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఒంగోలు మార్కెట్ యార్డులోని ఇసుక నిల్వ కేంద్రం, జరుగుమల్లిలో రెండు కేంద్రాలలో మొత్తం 44 వేల టన్నులు ఇసుక ఉన్నట్లు జిల్లా మైనింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నాగులుప్పలపాడు మండలంలోని కోల్డ్ స్టోరేజ్ సమీపంలో 216 జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై బ్రహ్మనాయుడు వివరాల మేరకు వేటపాలెం మండలం రావురు గ్రామానికి చెందిన ఎండ్లూరి ఎలీషా(45) ఉప్పుగుండూరు నుంచి బైక్‌పై ఒంగోలు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామ VRO బోర్ర తిరుమలయ్య(52) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఛాతిలో నొప్పి రావడంతో సిబ్బందికి తెలియజేశారు. సిబ్బంది వెంటనే 108 సహాయంతో వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. తోటి ఉద్యోగి మృతి చెందడంతో ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.
Sorry, no posts matched your criteria.