India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొండపిలోని స్కిల్ హబ్‌లో నిరుద్యోగ యువతీ, యువకులకు ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, కంప్యూటర్ కోర్సులలో 3నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, స్కిల్ హబ్ నిర్వాహకులు గోపికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాస్ లేక ఫెయిల్ లేదా ఆ పైన చదివిన వారికి ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. 25వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
సీజన్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని మున్సిపల్ శాఖ అధికారులు, మెడికల్ అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. నివాస ప్రాంతాలలో మురుగునీరు నిలువ ఉండకుండా చూడాలని, నీటి కుంటల వద్ద ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.
అద్దంకి మండలం వెంకటాపురం జాతీయ రహదారి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రేణింగవరం వైపు సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వేటపాలెం మండలం రామాపురం తీరం వద్ద నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాలకి చెందిన నలుగురు యువకులుగా పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. మృతి చెందిన యువకులలో నితిన్ (26), అమలరాజ (27), కిషోర్ (25) మృతదేహాలు లభ్యమయ్యాయి. నాని (23) అనే యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మాజీ శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి బుర్రా లక్ష్మమ్మ వయోభారం వలన శుక్రవారం మరణించారని బుర్రా అనుచరులు తెలిపారు. కాగా శనివారం ఉదయం 10:00 గంటలకు టంగుటూరు మండలం, శివపురం గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు సూచన మేరకు తెలియజేశారు.
వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి వచ్చిన నలుగురు యువకులు గల్లంతైన ఘటన వెలుగు చూసింది. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు వ్యక్తులు గల్లంతు అయినట్లు స్థానికులు తెలిపారు. తీరానికి మూడు మృతదేహాలు కొట్టుకు రాగా నాలుగో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత (21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు రేప్ చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాలో డ్రగ్స్, గంజాయి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ వాల్ పోస్టర్‌ను పోలీసులు విడుదల చేశారు. ఎవరైనా గంజాయి ఇతరత్రా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు సమాచారం ఉంటే ఇవ్వాలని, పరిష్కరించడానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. అలాగే ఎప్పటికప్పుడు వాటిపై నిఘా ఉంటుందన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలోని ప్రవేశాలకు ఈనెల 24, 25 తేదీలలో కౌన్సెలింగ్ జరుగుతుందని జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. పదవ తరగతి మార్కులు జాబితా కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు వంటి పత్రాలతో ఆ తేదీల్లో హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత కళాశాల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వనున్నట్లు వివరించారు.
రాష్ట్రం మొత్తం మీద చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా 42 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభినందించారు. గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల అధ్యక్షతన జరిగిన ఎన్నికల ఫలితాల సమీక్షా సమావేశంలో చీరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది. ఆమంచి తన సత్తా చాటారని షర్మిల వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కూడా పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.