India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2023 రబీ పంటలకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు గురువారం మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో జిల్లా అధికారులతో కలిసి కేంద్రం బృందం పర్యటించనుంది. తర్లుపాడు మండలంలోని పోతలపాడు, గానుగపెంట, మార్కాపురం మండలంలో వేములకోట, పెద్దారవీడు మండలంలో గొబ్బూరులో రైతులను కలిసి పంట నష్టం వివరాలు, తాగునీటి కొరత తదితర విషయాలపై ఆరా తీయనున్నారు.
సూర్యలంక సముద్రతీరంలో అలల తాకిడికి మునిగిపోతున్న యువకులను పోలీసులు, గజ ఈతగాళ్లు కాపాడారు. బుధవారం బాపట్ల రైలుపేట నుంచి సముద్ర తీరానికి వచ్చిన సిద్దు, ఊసా మణికంఠ అనే యువకులు అలల తాకిడికి మునిగిపోతున్నారు. ఇది గమనించిన పోలీసులు వెంటనే సముద్రంలోకి వెళ్లి గజ ఈతగాళ్ల సహాయంతో యువకులను కాపాడి ప్రథమ చికిత్స అందించి వైద్యశాలకు తరలించారు.
పర్చూరు నియోజకవర్గానికి చెందిన గొట్టిపాటి భరత్ కుమార్‌కు బుధవారం అద్దంకి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో మార్టూరు వద్ద జాతీయ రహదారిపై నాగరాజుపల్లె కాపులకు మద్దతుగా భరత్ ఆందోళన నిర్వహించిన సందర్భంగా ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసు విచారణకు భరత్‌తో పాటు మరో నలుగురు గైర్హాజరవుతున్న నేపథ్యంలో వారందరికీ అద్దంకి జూనియర్ సివిల్ జడ్జి నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేశారు.
పాత మాగులూరుకు చెందిన చల్లా సాయిరాం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం తిరిగి మంగళవారం స్వగ్రామం వస్తుండగా త్రిపురాంతకం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వీరి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని నరసరావుపేట హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ సాయిరాం బుధవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అద్దంకి- నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న మహిళలు పామాయిల్ తీసుకెళ్లేందుకు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని క్రేన్ సహాయంతో యాంకర్‌ను పక్కకి తొలగించారు.
ప్రకాశం జిల్లాలో వైసీపీ హయాంలో 410 పోస్టులున్నాయని ..వాటిలో ఎస్జీటీ 111, స్కూల్ అసిస్టెంట్లు 299, టీజీటీ 93 పోస్టులను జోనల్ స్థాయిలో భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వగా.. ప్రస్తుతం 16,347 భర్తీ చేయనున్నారు. ప్రకాశం జిల్లాకు ఎన్ని పోస్టులనే దానిపై ఉత్కంఠ సాగుతోంది. జిల్లాలో దీని కోసం 30 వేల మంది ప్రిపేర్ అవుతున్నట్లు అంచనా..!
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని మంగళవారం జమ చేసినట్లు ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 17 వ విడతగా విడుదల చేసిన సాయం జిల్లాలో 2.42 లక్షల మంది రైతులకు రూ. 48.43 కోట్లు విడుదల అయినట్లు ఆయన పేర్కొన్నారు. డీబీటీ పద్ధతిలో ఒక్కో రైతుకు బ్యాంకు ఖాతాలోకి రూ.2వేలు జమ చేశారని, ఇది పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టరేట్ లో బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ కార్యాలయం తెలిపింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు, నూతనంగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామికి కలెక్టర్ పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.
గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మంగళవారం కారు, లారీ ఢీకొని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్తున్న కారు, నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వస్తున్న లారీ మూల మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు.
Sorry, no posts matched your criteria.