India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దర్శిలో ‘MLC గారి తాలూకా’ అంటూ బైక్లు, కార్లపై స్టిక్కర్లు వెలిశాయి. దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి MLC కేటాయించాలంటూ నియోజకవర్గ TDP శ్రేణులు గట్టిగానే పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇటీవల మీడియా సమావేశంలో కొందరు గొట్టిపాటి అభిమానులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జిల్లాలో గొట్టిపాటి ఫ్యామిలీకి చంద్రబాబు మంచి విధేయుడని, కచ్చితంగా లక్ష్మికి MLC పదవి దక్కుతుందని ఆమె వర్గీయులు ఆశిస్తున్నారు.
కాసేపటి క్రితం ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రకాశం జిల్లాలో 5,487 మంది పరీక్షలు రాయగా… 3330 మంది పాసయ్యారు. మొత్తం 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా .. జిల్లా 12వ స్థానంలో నిలిచింది. దాంతో పాటు ఒకేషనల్‌కు ప్రకాశం జిల్లాలో 862 మంది పరీక్ష రాయగా 534 మంది పాసయ్యారు. ఇందులో జిల్లా 62 శాతం ఉత్తీర్ణత సాధించింది.
ఒంగోలులో డీఈఐఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 24 నుంచి 27 వరకు జరుగుతాయని విద్యాశాఖ పరీక్షల విభాగం అధికారి కె. శివకుమార్ తెలిపారు. డైట్ మైనంపాడు కేంద్రంలో జరిగే పరీక్షకు 2022-24 బ్యాచ్ విద్యార్థులు హాజరవుతారన్నారు. ఉదయం 9-11.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని, హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో సంరక్షణ కేంద్రమైన నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఉంది. ఇది దేశంలోనే 53 టైగర్ రిజర్వాయర్లలో పెద్దది. అయితే పులులకు ఆహారం తగ్గడంతో మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావు ఆధ్వర్యంలో నెక్కంటి అటవీ క్షేత్రాధికారి ఆరీఫ్ ఖాన్ 28 సాంబార్లు, 15 చుక్కల దుప్పులను కాకినాడ నుంచి తీసుకొచ్చారు. వాటిని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలినట్లు తెలిపారు.
మాజీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 22న శనివారం ఉదయం 10.30కి తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు , ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ హాజరుకానున్నారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డిపాలెం కోటిరెడ్డి సోమవారం ఆనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు యలమందారెడ్డి వైసీపీ క్రీయాశీలక కార్యకర్తగా, జిల్లా వైసీపీ సేవాదళ్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ గ్రామానికి చేరుకుని కోటిరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి పలికారు.
ప్రకాశం జిల్లాలో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే ఆస్కారం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. మరోవైపు, పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలోనూ వర్షాలు పడతాయని APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
వెయ్యి ఏళ్ల చరిత్ర కల్గిన స్వర్ణమ్మ తల్లికి స్వర్ణ గ్రామంతో అనుబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. పూర్వం వరదలు వచ్చినప్పుడు చీరాల నుంచి వరద నీరు స్వర్ణ గ్రామాన్ని ముంచెత్తితే స్వర్ణమ్మ తన కొంగును అడ్డు పెట్టి గ్రామాన్ని కాపాడిందని భక్తులు చెబుతూఉంటారు. స్వర్ణమ్మ తల్లి కోర్కెలు తీరుస్తుందని..ఏ శుభకార్యం జరిగినా తొలి అహ్వాన పత్రికను అమ్మవారికే సమర్పిస్తారని స్థానికులు డెబుతున్నారు.
వ్యవసాయ డిప్లమో కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆచార్య రంగా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.సంధ్యారాణి తెలిపారు. కోర్సుల్లో చేరేవారు ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు 2023 ఆగస్టు 31 నాటికి 15 సంవత్సరాల నుంచి 22 వయస్సు కలిగి ఉండాలన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. ఈక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు తమ నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా దర్శి మండలంలో 9 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు రాజీనామా చేశారు. తుమ్మెదలపాడు, తూర్పువీరాయపాలెం, బొట్లపాలెం, రాజంపల్లి, సామంతపూడి, తానంచింతల, బండి వెలిగండ్ల, చందలూరు, త్రిపురసుందరీపురం గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల నుంచి తప్పుకొన్నారు.
Sorry, no posts matched your criteria.