India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయించినట్లు ఈఎస్ టి.శౌరి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 బార్లు, 178 మద్యం దుకాణాలను సీజ్ చేశామన్నారు. ఎన్నికలు అయ్యే వరకు మద్యం విక్రయాలు చేయకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు విధించడంతో చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు నేరచరితులకు కూడా అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్ తాజా ఉత్తర్వులతో నేరచరితులు, రౌడీషీటర్లు కూడా పోలింగ్ ఏజెంట్లుగా పని చేయవచ్చని తెలిపింది. అది కూడా గత సార్వత్రిక ఎన్నికల వరకు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటుకు నోటు తెరలేసింది. పట్టును బట్టి డబ్బు.. డిమాండ్ చేస్తే మరింత పెంపు. ఇప్పుడు జిల్లా అంతా ‘అన్నా మీ ఊరిలో ఓటుకు ఎంత ఇస్తున్నారే’ అనే పదం చక్కర్లు కొడుతుంది. ఓటుకు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు నగదు. పైగా బంగారం, బియ్యం ప్యాకెట్లు, వెండి, చీరలు ఇస్తున్నారని సమాచారం.
* ఓటరా.. గుర్తు పెట్టుకో నోటుతో నీ అమూల్యమైన ఓటును అమ్ముకొని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకు.
★ ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
★ ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు
★ ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం
★ మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం నిషిద్ధం
★ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.
ఈవీఎంల ధ్వంసానికి పాల్పడినా, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిపై ఘర్షణకు పాల్పడినా వారిపై అత్యంత తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.5.30కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను, వాహనాలను సీజ్ చేశామన్నారు. వీటిలో నగదు రూ.1.70కోట్లు, రూ.50లక్షల విలువైన 26,751 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు
ఎన్నికల క్రతువులో ముఖ్యఘట్టమైన ఎన్నికల ప్రచారం క్లోస్ అయింది. ప్రచార వాహనాలకు బ్రేక్ పడింది. సౌండ్ బాక్సుల మోతలు, డీజే శబ్దాలు ఆగిపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు నెలరోజులుగా పోటీలో నిలిచిన నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఓట్లు అభ్యర్థించగా.. హామీలు, విమర్శలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇకపై ఓటర్ అన్నదే ఫైనల్ తీర్పు మిగిలి ఉంది.
☛ ఓటు హక్కు వినియోగించుకుందాం.. సరైన నాయకుడిని ఎన్నుకుందాం.
మే 13న ఎన్నికలు జరుగుతున్నందున, వైన్స్ షాప్‌లు రెండు రోజులు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైన్స్ షాప్‌లు దగ్గర మందు బాబులు భారీగా లైన్‌లు కట్టి మద్యం కొనుగోలు చేస్తున్నారు. మద్యం షాపులు తెరిచిన వెంటనే మద్యం మొత్తం అమ్ముడు పోవడంతో వైన్స్ షాప్‌లు కొన్ని చోట్ల మూత వేశారు. కాగా, ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాప్‌లు ఉంటాయని, ఆ తర్వాత మూత పడతాయన్న విషయం తెలిసిందే.
2024 ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. మరికొన్ని గంటలే ఉండటంతో నాయకులు సమయం లేదు మిత్రమా అంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఫోన్లు, ప్రకటనలు, ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. నాయకులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించేందుకు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రావెల్ ఛార్జులు కూడా నాయకులే ఇస్తుండటం గమనార్హం.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేటితో ప్రచార పర్వం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఒంగోలు, దర్శి నియోజకవర్గాల్లో రూ.3వేలు ఇస్తున్నట్లు సమాచారం. గిద్దలూరు, మార్కాపురం, చీరాల, అద్దంకి 2000 ఇస్తున్నారట. కాగా కొండపి, కనిగిరి, వై.పాలెంలో ఓటుకు 1500-2000 ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అటు ఇలాంటివి కట్టడి చేసేందుకు ఈసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
యద్దనపూడి మండలం పూనూరు గ్రామంలో విషాద ఘటన చేటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకొండ మేరి (28) పోతురాజు దంపతులు పరదాల వ్యాపారం నిమిత్తం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఎన్నికల్లో స్వగ్రామంలో ఓటేసేందుకు గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై పూనూరుకు బయల్దేరారు. ఈ క్రమంలోనే కామారెడ్డి వద్ద ప్రమాదానికి గురై, మేరి మృతి చెందినట్లు సమాచారం అందిందని బంధువులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.