India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసుల రెడ్డి విద్యుత్, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు విద్యుత్ శాఖ కేటాయించారు. దీంతో జిల్లాకు రెండో సారి విద్యుత్ శాఖనే వరించింది. గత ప్రభుత్వంలో జిల్లాకు ఇద్దరికి మంత్రి పదవులు కేటాయిస్తే.. ఈ ప్రభుత్వంలో కూడా ఇద్దరికి మంత్రి పదువులు వరించాయి.
సీఎం చంద్రబాబు మంత్రులకు శాఖలు కేటాయించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు విద్యుత్ శాఖ, కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికు సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లోని కూటమి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
17న బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఆవులు, లేగ దూడల సామూహిక వధ జరిగితే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బేబీ రాణి హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జంతువు వధ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎవరు సామూహిక వధ కోసం పశువులను అమ్మకూడదన్నారు.
సీఎం చంద్రబాబు తన మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో జిల్లాలోని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 16,347 డీఎస్సీ పోస్ట్‌లలో జిల్లాకు వెయ్యికి పైగా వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా ఇది వరకే దాదాపు 20 వేల మంది టెట్ పరీక్ష రాశారు. ఈ మెగా డీఎస్సీ ప్రకటనతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జగన్ DSC ద్వారా దాదాపు 6 వేల పోస్టులు ప్రకటించగా.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా మెగా DSC పేరిట CM చంద్రబాబు దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు. గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలకు పైగానే పెరిగింది. మరి తాజా నోటిఫికేషన్‌లో జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయిస్తారనేది త్వరలోనే తెలియనుంది.
కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన ఇనకల్లు నరసింహం అనే యువకుడు రెండు రోజుల క్రితం గ్రామంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు తెలియచేసే ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ విద్యుత్ షాక్‌తో మరణించాడు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సాయంత్రం ఆ కుటుంబాన్ని పరామర్శించి, నరసింహం తల్లి అనురాధను ఓదార్చారు. రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందించారు.
యర్రగొండపాలెం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను దర్శి వ్యవసాయ సంచాలకులు కె. బాలాజీ నాయక్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాకును పరిశీలించారు. రైతులు ఎటువంటి విత్తనాలు కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనుమతులు లేని రూ.5లక్షల విలువగల ఎరువులు సీజ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ శేషి రెడ్డి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం మండలంలోని పిచ్చిగుంట్లపల్లి గ్రామ శివారులో పాడుబడిన బావిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వెంకటేశ్వర నాయక్ మృతి చెందిన మహిళను యాచకురాలిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంత్రి వర్గ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ ఎన్నికైన విషయం తెలిసిందే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గొట్టిపాటి, హ్యాట్రిక్ నమోదు చేసిన వీరాంజనేయకు మొదటిసారి మంత్రి పదవులు దక్కాయ. ఇప్పుడు వారికి సీఎం చంద్రబాబు ఏ శాఖలు కేటాయిస్తారన్నది జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. వారికి ఏ శాఖలు దక్కుతాయనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఒంగోలు నెహ్రు నగర్లో 15 ఏళ్ల బాలుడు బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు శ్రీకాంత్(15) ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.