Prakasam

News June 13, 2024

యర్రగొండపాలెం: బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ రాజీనామా

image

యర్రగొండపాలెంకు చెందిన రాష్ట్ర బీసీ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పోలెబోయిన రామారావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి రాజీనామా లేఖను పంపినట్లు బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, మాజీ సీఎం జగన్‌, యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ వెంట నడుస్తామని స్పష్టం చేశారు.

News June 12, 2024

సత్తా చాటిన పుల్లల చెరువు విద్యార్థి

image

ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా విద్యార్థి సత్తా చాటాడు. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో పుల్లల చెరువు మండలం అక్కపాలేనికి చెందిన కొమిరిశెట్టి ప్రభాస్‌ పదో ర్యాంక్ సాధించాడు. ఆయన తండ్రి పెద్ద పోలయ్య గుంటూరు మిర్చియార్డులో చిరు వ్యాపారిగా పని చేస్తూ జీవనం సాగించేవారు. కంప్యూటర్ సైన్స్ రంగంలో రాణించాలన్నదే తన లక్ష్యమని ప్రభాస్ తెలిపాడు. విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.

News June 12, 2024

మంత్రిగా గొట్టిపాటి ప్రమాణ స్వీకారం

image

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘ గొట్టిపాటి రవి కుమార్ అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.

News June 12, 2024

మంత్రిగా డోలా ప్రమాణ స్వీకారం

image

కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘ డోలా బాల వీరాంజనేయస్వామి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.

News June 12, 2024

సముద్ర స్నానానికి వెళ్లి యువకుడి గల్లంతు

image

వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. చెన్నైలోని ఎంజీఆర్ యూనివర్సిటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న కనగళ్ల గౌరీశ్ (21) రామాపురం బీచ్‌లో సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలిసి వచ్చాడు. సముద్ర స్నానాలు చేస్తుండగా అలలు తాకిడికి గౌరీశ్ గల్లంతయ్యాడు. కొద్దిసేపటికి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 12, 2024

అభ్యంతరాలు 15 లోపు తెలియజేయాలి: డీఈఓ సుభధ్ర

image

స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన సీనియార్టీ జాబితాను డీఈఓ వెబ్సైట్‌లో పెట్టినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర మంగళవారం తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి, ప్రధాన ఉపాధ్యాయులకు, ఉప విద్యాశాఖ అధికారికి తెలియజేయాలన్నారు.

News June 12, 2024

గొట్టిపాటి, వీరాంజనేయస్వామి రాజకీయ నేపథ్యం..

image

ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కేటాయిస్తూ చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ మంత్రి పదవులకు ఎంపికయ్యారు. స్వామి 3 సార్లు, గొట్టిపాటి రవికుమార్ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరికీ ఏ శాఖలు కేటాయించనున్నారో అన్న అంశం ఆసక్తిగా మారింది. 

News June 12, 2024

కొరిశపాడు: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

image

కొరిశపాడు మండలం రాచపూడిలో అగ్రహారానికి చెందిన పీక రాజేశ్ అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో సీఐ శివరామకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు బేల్దారి మేస్త్రిగా పనిచేస్తూ ఉంటాడని గుర్తించారు. మృతదేహాన్ని అద్దంకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానస్పద కేసుగా నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

News June 12, 2024

ప్రకాశం జిల్లా నుంచి మంత్రులు వీరే..

image

TDP అధినేత చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. 24 మందితో కూడిన జాబితాను జాబితాను తాజాగా ఆయన ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. డోలా బాల వీరాంజనేయస్వామి( కొండపి), గొట్టిపాటి రవి కుమార్( అద్దంకి)కు చోటు దక్కించుకున్నారు. వీరికి అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

News June 11, 2024

ప్రకాశం: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఫ్లెక్సీ కడుతూ దుర్మరణం

image

కందుకూరు మండలం మాచవరంలో మంగళవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. బుధవారం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మాచవరం గ్రామ శివారులో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నప్పుడు కరెంట్ షాక్ తగిలి నరసింహ(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న కరెంటు స్తంభం తీగలు తగిలి షాక్‌తో నరసింహ పైనుంచి కింద పడినట్లు స్థానికులు తెలిపారు.