India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
త్రిపురాంతకం మండలం కేసినేనిపల్లి ఫ్లైఓవర్ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి ఆర్మీ జవాన్ ఓబులేసు (35)గా పోలీసులు గుర్తించారు. ఇతడిది పోరుమామిళ్ల గ్రామమని, బంధువులకు సమాచారం అందించినట్లు
ఎస్సై సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి ఫ్లై ఓవర్ సమీపంలో మంగళవారం కారు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.
పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేసేందుకు ఒంగోలు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా మండలాలకు బ్యాగ్లు, పుస్తకాలు, బూట్లు, బెల్ట్ తదితర వస్తువులు సరఫరా చేశారు. అక్కడి నుంచి పాఠశాలలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హెచ్‌ఎంకు రవాణా ఛార్జీలు మంజూరు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి స్టూడెంట్ కిట్ పేరుతో పంపిణీ చేపట్టాలని మౌఖిక ఆదేశాలందాయి.
కొండపి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గోగినేని శారద స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తన రాజీనామా పత్రాన్ని మార్కెట్ యార్డ్ సెక్రెటరీ కె.మాధవరావు ద్వారా రాష్ట్ర వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు పంపినట్లు మంగళవారం ఆమె వివరించారు.
సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో సముద్రం ఒడ్డున మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు కందుకూరుకు చెందిన కొత్తూరి వెంకటేశ్వర్లు (45)గా గుర్తించారు. మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. సింగరాయకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన, సమావేశంలో అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతులు పొందిన స్కానింగ్ కేంద్రాలు తిరిగి రెన్యువల్ చేసుకున్నారా లేదా కూడా పరిశీలించాలన్నారు. సమావేశంలో ఆరోగ్య శాఖకు చెందిన శ్రీధర్ రావు, డీఎంహెచ్‌వో సురేష్, నాగార్జున తదితర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుకానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ సాగుతోంది. ఈరోజు విజయవాడలో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు సైతం రేసులో ఉన్నారు
ప్రస్తుతం జిల్లాలోని కీలక స్థానాలో ఉన్న అధికారుల్లో ఎక్కువ మంది మూడేళ్లకు పైగా కొనసాగుతున్నారు. వీరిలో పాటు, వైసీపీ మంత్రులు, MLAల సిఫార్సులతో వచ్చినవారు ఉన్నారు. TDP అధికారంలోకి రావడంతో రాష్ట్రస్థాయిలో కీలక స్థానాల్లో అధికారుల మార్పు మొదలైంది. తొలుత కలెక్టర్, సంయుక్త కలెక్టర్, డీఆర్వో ఉంటనున్నట్లు తెలుస్తోంది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి, జిల్లా మత్య్సశాఖ అధికారి పేర్లు వినిపిస్తున్నాయి.
గిద్దలూరులో సోమవారం కరెంట్ షాక్‌తో అన్నదమ్ములు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆటోలో సప్లయర్స్ సామగ్రి తరలించి తిరిగి వెళ్తున్న క్రమంలో మోటర్ వైర్లు ఆటోకు తగిలాయి. దీంతో ఆటోలో ఉన్న అన్నదమ్ములు శీలం లోహిత్ (18) దేశాయి కృష్ణ(16) అక్కడికక్కడే మృతి చెందారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కృష్ణ 530 మార్కులు సాధించాడు. లోహిత్ ఐటీఐ చదువుతున్నాడు. వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అదుపుతప్పి కారు ఫెన్సింగ్ ఢీకొట్టి గుంతలో పడింది. ఈ సంఘటన జాతీయరహదారిపై ఉలవపాడు దక్షిణ బైపాస్ సమీపంలో సోమవారం జరిగింది. ఒంగోలు సుజాతనగర్ చెందిన కామేష్ తన భార్యతో కలసి ఒంగోలు నుంచి కావలి వెళుతున్నారు. ఉలవపాడు వద్దకు వచ్చేసరికి మలుపు వద్ద ఫెన్సింగ్ ఢీకొట్టి గుంతలో పడిపోయింది. ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. వేరే వాహనంలో వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.