India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి విశాఖపట్నం వైపు మళ్లిస్తామన్నారు.
రాష్ట్ర కేబినెట్‌లో ప్రకాశం జిల్లా నుంచి ఎవరికి చోటు దక్కుతుందోనని చర్చ ప్రకాశం జిల్లాలో విస్తృతంగా నడుస్తోంది. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 స్థానాల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మన జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో కామెంట్ చేయండి.
కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెంలో బిహార్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ కుమార్ తాను అద్దెకు నివాసముంటున్న ఇంట్లో ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో అద్దంకి రూరల్ సీఐ శివరామ కృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు తిమ్మన్నపాలెంలోని గ్రానైట్‌లో పనిచేస్తుంటాడని గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటివరకు 19 సార్లు(ఉప ఎన్నికలతో కలిపి) ఎన్నికలు జరిగాయి. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్లపై 32,994 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఎన్నికల్లో అదే అత్యధిక రికార్డు. కానీ 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ బాలినేనిపై 34,026 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. కాగా 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దామచర్లదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.
ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివ తెలిపిన ప్రకారం పెరుగు పల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడి కత్తి పౌలు అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గత ఎన్నికల్లో YCP గిద్దలూరు నియోజకవర్గంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి సైకిల్ జోరందుకుంది. 2019 ఎన్నికల్లో గిద్దలూరు YCP ఎమ్మెల్యే అన్నా రాంబాబు TDP MLA అభ్యర్థి అశోక్ రెడ్డిపై 81,035 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా 2024 ఎన్నికల్లో పరిస్థితి తలక్రిందులైంది. TDP అభ్యర్థి అశోక్ రెడ్డి నాగార్జునరెడ్డిపై 973 ఓట్లతో విజయం సాధించారు. దీంతో ఓటమికి గల కారణాలు ఏంటా అని ప్రశ్నించుకుంటున్నారు.
వైసీపీ అధికారంలోకి రాగానే యర్రగొండపాలెంలోని పంచాయతీ కాంప్లెక్స్‌కు టీడీపీ నేత వేగినాటి కోటయ్య పేరును తొలగించి.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పేరు మార్చారు. అప్పట్లో అది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరలా వేగినాటి కోటయ్య పేరును ఇవాళ పంచాయతీ కాంప్లెక్స్‌కు టీడీపీ నేతలు మారుస్తున్నారు.
భార్యపై అనుమానంతో భర్త గొంతు కోసి హత్యకు పాల్పడిన ఘటన చినగంజాం మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థానిక ఎస్టీ కాలనీకి చెందిన కత్తి శ్రీనివాసరావు తన భార్య దుర్గపై అనుమానంతో తరచూ గొడవలు పడేవాడు. ఈనేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను అక్కడికి వెళ్లి కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లాలోని పర్చూరు, చీరాలలో వైసీపీ, వైపాలెంలో టీడీపీ ఇంతవరకు ఖాతాలు తెరవలేదు. 2009లో డీలిమిటేషన్‌లో కొత్తగా వైపాలెం నియోజకవర్గం ఏర్పడింది. అప్పటినుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఒకసారి, మూడుసార్లు వైసీపీ గెలిచింది. అలాగే చీరాలలో వైసీపీ వచ్చాక జరిగిన మూడు ఎన్నికలలో ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు. ఇక పర్చూరులోనూ వైసీపీకి ఆశాభంగమే ఎదురైంది.
కురిచేడులోని తాగునీటి చెరువులో నవజాత శిశువు మృతదేహం పడేసిన విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు ఎస్సై చెప్పారు. ఎవరు ఆ మృతదేహాన్ని చెరువులో పడేశారు. అసలు మృతదేహం ఎలా వచ్చింది అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.