India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు రోడ్డు ప్రమాదం జరిగింది. తెనాలిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించి ఒంగోలు వస్తుండగా కొరిసపాడు మండలంలోని రేణింగవరం వద్ద కారు టైర్ పగిలి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
మంగళగిరికి చెందిన ఇద్దరు యువకులు స్నేహితులతో పాటు బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్ర తీరానికి బుధవారం విహారయాత్రకు వచ్చారు. వీరు సముద్రంలో మునుగుతూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలల తాకిడికి ఇద్దరు సముద్రంలోకి వెళ్లిపోయారు. నీటిలో కొట్టుకుపోతున్న వీరిని అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు వెంటనే అప్రమత్తమై రక్షించి ఒడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారు.
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. వీరికి తోడుగా పార్టీ అధినేతలు జిల్లాకు క్యూ కట్టారు. ఏప్రిల్ 28, 30న జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. శుక్రవారం కనిగిరిలో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో పాల్గొననున్నారు. అదే రోజు పొదిలిలో చంద్రబాబు నాయుడు, గిద్దలూరులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఒకే రోజు జిల్లాలో పర్యటిస్తున్న తరుణంలో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది.
జిల్లా పోలీస్ సిబ్బంది సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఎస్పీ గరుడ్ సుమిత్ సూచించారు. జిల్లాకు కేటాయించిన CAPF అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో నిర్వహించాల్సిన విధుల గురించి దిశానిర్దేశం చేశారు. అలాగే అక్రమ నగదు, మద్యం, ప్రలోభ వస్తువులకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 3వ తేదీన కనిగిరికి రానున్నట్లు ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు పాడుబడిన భవనంపై భక్తులు నిలబడి ఉండడంతో భవనం ముందు భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలకు గాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ నెల 3వ తేదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిద్దలూరులో పర్యటిస్తారు. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని గిద్దలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చీరాలకు వస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడతారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లారు. తాజాగా బలరాం కుమారుడు వెంకటేశ్ చీరాల నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో బలరాం, వెంకటేశ్‌పై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
జిల్లాలో తొలి దశలో 696 మంది విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు డీఈవో డి.సుభద్ర తెలిపారు. కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన లాటరీలో జిల్లాలో ఒకటో తరగతిలో ప్రవేశాలకు పలువురు విద్యార్థులు అర్హత సాధించారన్నారు. వీరిలో బీసీలు 234, మైనార్టీలు 53, ఓసీలు 147, ఎస్సీ 244, ఎస్టీ విద్యార్థులు 18 మంది ఉన్నారన్నారు.
చీరాలలో మంగళవారం దారుణం జరిగింది. రైల్వేస్టేషన్లోని మూడో నంబరు ఫ్లాట్‌ఫారంను దాటుతున్న ఓ గుర్తు తెలియని మహిళను తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్రమాదవశాత్తు ఢీకొంది. ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉండొచ్చని రైల్వే ఎస్సై కొండయ్య తెలిపారు. ఆమె వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యంకాలేదు. వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.