India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఒంగోలు వచ్చిన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను దామచర్ల జనార్దన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకేను అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై బాలకృష్ణ ఆరా తీసినట్లు తెలిసింది. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకొల్లులో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న సూపరింటెండెంట్ తోపాటు పలువురు ఉద్యోగులు వారి మాతృశాఖకు తిరిగి వెళ్లారు. కొన్నేళ్ల నుంచి పలువురు ఉద్యోగులు వైద్యశాఖ అనుబంధ శాఖల్లో పనిచేస్తూ డిప్యూటేషన్ పై వైద్య ఆరోగ్యశాఖకు వచ్చారు. వైద్యశాఖ సూపరింటెండెంట్ పయ్యావుల శ్రీనివాసరావుతో పాటు మరో ఐదుగురు ఉద్యోగులు మంగళవారం రిలీవ్ అయ్యి మాతృశాఖకు వెళ్లారు.
బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ప్రవేశానికి లాటరీ విధానంలో 696 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. వీరిలో బీసీలు 234 మంది, మైనార్టీలు 53 మంది, ఓసీలు 147, ఎస్సీలు 244, ఎస్టీలు 18 మంది ఉన్నారు. ఆయా పాఠశాలల్లో మే 10వ తేదీలోపు సంబంధిత పత్రాలు సమర్పించి ప్రవేశం పొందాలన్నారు.
వేటపాలెం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 సహాయంతో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ కొండపిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై సరదాగా వ్యాఖ్యలు చేశారు. ‘మన ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు. నాకంటే పొట్టి, కానీ వయసులో నేనే పెద్ద’ అంటూ నవ్వులు పూయించారు. ఇక్కడి పొగాకు చూస్తే తనకు వీరసింహారెడ్డి సినిమా గుర్తుకువచ్చిందన్నారు. ఈ సందర్భంగా బాలయ్య పలు సినిమాల డైలాగులు చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు.
మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లో ఈతకెళ్లి ఒంగోలుకు చెందిన ఆటోడ్రైవర్ గొరిపర్తి సాంబశివరావు (35) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి గుండ్లకమ్మ జలాశయంలో ఈత కొట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సోమవారం ఉదయం మృతదేహం నీటిలో తేలియాడింది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రమేశ్ చెప్పారు.
ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈనెల 22వ తేదీన 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 38 పరీక్ష కేంద్రాల్లో సజావుగా సాగాయని యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి పద్మజ తెలిపారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లుగా తెలిపారు.
ప్రకాశం జిల్లాలో ఇవాళ నారా లోకేశ్ ఒంగోలు, పవన్ కళ్యాణ్ గిద్దలూరు, దర్శి, ఒంగోలు, సీఎం జగన్ కొండపి, నందమూరి బాలకృష్ణ సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీంతో అభ్యర్థులు జనసమీకరణలు చేస్తున్నారు. ఇక పోలీసులు వీరి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతను రెట్టింపు చేశారు. ఒకేసారి జిల్లాకు నలుగురు రావడంతో జిల్లాలో రాజకీయ వేడి పులుముకుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మానవత్వం మంటకలిసిన రోజు. ఓ క్షతగాత్రుడు రోడ్డుపై రక్తమోడుతున్నా ఎవరూ పట్టించికోలేదు. తోటి స్నేహితులు ఎంత ప్రయత్నించిన కాపాడుకోలేకపోయారు. ఒంగోలులోని ఓ కళాశాల ఎదురుగా విద్యార్థి వెంకటేశ్ రోడ్డు దాటుతూ ఉండగా ఓ కాలేజ్ బస్సు ఢీకొనడందో పక్కనే ఉన్న డివైడర్‌పై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. తోటి విద్యార్థులు అతడిని వెంటనే రిమ్స్‌కు తరలించినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.