India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కందుకూరు టీడీపీ నుంచి గెలిచిన అభ్యర్థి సంచలన ప్రకటన చేశారు. ‘వైసీపీ ప్రభుత్వం కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపి అన్యాయం చేసింది. దానిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడానికి ప్రయత్నం చేస్తా. అలాగే నారా లోకేశ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’ అని కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు మళ్లీ ప్రకాశం జిల్లాలో కలవడంపై మీ అభిప్రాయం ఏంటి?
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్ + 24890
దర్శి – శివ ప్రసాద్ రెడ్డి +2597
కందుకూరు – నాగేశ్వరరావు +18558
కనిగిరి – ఉగ్ర +14604
కొండపి – డోల వీరాంజనేయస్వామి +24756
మార్కాపురం – నారాయణ రెడ్డి +13979
ఒంగోలు – దామచర్ల +34026
పర్చూరు – ఏలూరి సాంబశివరావు +24013
సంతనూతలపాడు – బీఎన్ విజయ్ కుమార్ +30385
యర్రగొండపాలెం – తాటిపర్తి చంద్ర శేఖర్ +5477
చీరాల – M.M. కొండయ్య +20984
గిద్దలూరు – అశోక్ రెడ్డి +973
ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటగట్టుకున్న YCP నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒంగోలు మాజీ MLA బాలినేని శ్రీనివాసలెడ్డి ఎన్నికల్లో ఓటమి చవిచూడటంతో ఉద్వేగానికి లోనయ్యారు. నిన్న నాలుగు రౌండ్లు పూర్తవ్వగానే కౌంటింగ్ కేంద్రం వెళ్లిపోయారు. అనంతరం ఇంటికి చేరుకున్న బాలినేని తన కటుంబ సభ్యులతో కలిసి హుటాహుటిన హౌదరాబాద్ కు వెళ్లారు. తనకివే చివరి ఎన్నికలు అని గతంలో ఆయనే చెప్పిన విషయం తెలిసిందే.
పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులకంటే నోటాకు అధికంగా ఓట్లు లభించడం విశేషం. నియోజకవర్గంలో 15 మంది పోటీ చేయగా కేవలం ముగ్గురు మాత్రం 5 వేల కంటే అధికంగా ఓట్లు సాధించారు. నోటాకు 1289 ఓట్లు లభించాయి. మిగిలిన 12 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగా ఓట్లు పోల్ అవ్వడం గమనార్హం. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు మాత్రమే 5000 కంటే అధికంగా ఓట్లు వచ్చాయి.
ఒంగోలు ఎంపీగా టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై 48వేలకు పైగా ఓట్లతో ఘనవిజయం సాధించారు.
దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై విజయం సాధించారు. 21 రౌండ్లు పూర్తయ్యే సరికి 2597 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. దీంతో జిల్లాలో టీడీపీకి 10 స్థానాలు, వైసీపీ రెండు స్థానాలు గెలిచాయి.
ప్రకాశం జిల్లాలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. దర్శిలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వెనుకబడ్డారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2,363 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. గొట్టిపాటి లక్ష్మికి 97,416 ఓట్లు రాగా, బూచేపల్లికి 99,779 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 20 రౌండ్లు పూర్తవ్వగా, చివరి రౌండ్ లో ఎవరు ఆధిక్యంలోకి వస్తారనేది ఆసక్తిగా మారింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 స్థానాల్లో ఫలితాలు తేలాయి. ఇక మిగిలింది దర్శి, అద్దంకి స్థానాలే. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ 22 వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి అయిన హనిమిరెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రకాశం జిల్లాలోని మరో నియోజవర్గంలో టీడీపీ గెలిచింది. తాజాగా చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎం.మాలకొండయ్య సమీప ప్రత్యర్థి కరణం వెంకటేశ్, 20,558 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని గెలిచింది. కాగా వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ కు 50,802 ఓట్లు రాగా, ఆమంచి కృష్ణమోహన్ కు41,295 ఓట్లు వచ్చాయి. మాలకొండయ్యకు 71,360 ఓట్లు నమోదయ్యాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది. కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరి నాగేశ్వరరావు గెలిచారు. సమీప ప్రత్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పై 17,813 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా టీడీపీ ఇప్పటివరకు 7 స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.