India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాతా తెరిచింది. యర్రగొండపాలెం నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్ బాబుపై తాటిపర్తి చంద్రశేఖర్ 5,200 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు వైసీపీ గెలిచిన స్థానం ఇదే కావడం విశేషం.
ప్రకాశం జిల్లాలోని మరో నియోజవర్గంలో టీడీపీ గెలిచింది. తాజాగా కొండపి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయస్వామి సమీప ప్రత్యర్థి మంత్రి ఆదిమూలపు సురేశ్‌పై 23,511 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఉమ్మడి ప్రకాశ జిల్లాలో టీడీపీ మరో స్థానాన్ని గెలిచింది.
ప్రకాశం జిల్లాలో 6వ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. తాజాగా ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిపై 34,100 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు టీడీపీ ఆరు స్థానాలు గెలిచింది. మిగిలిన స్థానాల్లో కూడా టీడీపీ ముందంజలో ఉండటంతో మరిన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది.
ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. సమీప ప్రత్యర్థి యడం బాలాజీపై 22,221 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు టీడీపీ నాలుగు స్థానాల (సంతనూతలపాడు, మార్కాపురం, గిద్దలూరు)ను సొంతం చేసుకుంది.
ప్రకాశం జిల్లాలో టీడీపీ మరో నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కుందూరు నాగార్జునరెడ్డిపై 2వేలకు పైగా ఓట్లతో గెలిచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ మూడు స్థానాల (సంతనూతలపాడు, మార్కాపురం)ను సొంతం చేసుకుంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సైకిల్ జోరు చూపిస్తోంది. మార్కాపురం నుంచి టీడీపీ నేత కందుల నారాయణరెడ్డి గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి అన్నా రాంబాబుపై 16746 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఇప్పటివరకు అధికారికంగా రెండు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. కాగా సంతనూతలపాడులో బి.ఎన్.విజయ్ గెలిచిన విషయం తెలిసిందే.
ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు నియోజకవర్గాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. సంతనూతలపాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఏన్ విజయ్ కుమార్ ఘన విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి, మంత్రి మేరుగా నాగార్జునపై 30,385 ఓట్ల తేడాతో గెలుపొందారు. సంతనూతలపాడును టీడీపీ కైవసం చేసుకోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా సాగుతోంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆధిక్యంలో కొనసాగున్నారు. ప్రస్తుతం 8 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మాగుంట 13,869 ఓట్లతో లీడింగులో ఉన్నారు. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉన్నా ఫలితాలు పూర్తయ్యే వరకు ఎవరు గెలుస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 12 స్థానాలకు టీడీపీ -8, వైసీపీ నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. దర్శి, గిద్దలూరు, వై.పాలెం, కనిగిరిలో ఇప్పటివరకు వైసీపీ లీడింగ్ లో ఉండగా, అద్దంకి, కొండపి, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాల, పర్చూరులో టీడీపీ ముందంజలో ఉంది.
ప్రకాశం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 2,760 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి వెనకబడి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.