India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అప్పుల బాధ తాళలేక ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శింగరాయకొండలో బుధవారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీరామ్ కథనం మేరకు కుంచాల శ్రీకాంత్ అనే వ్యక్తి ఆటో తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెలావారీ ఫైనాన్స్ చెల్లించక పోవడంతో ఫైనాన్స్ సిబ్బంది ఆటోను తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వలేటివారిపాలెం మండలం పోకూరుకి చెందిన జడ రవీంద్ర మృతి చెందాడు. గ్రామానికి చెందిన రవీంద్ర హైదరాబాదులోని ఓ కంపెనీకి చెందిన బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం మోటర్ బైక్ పైన హైదరాబాద్ నుంచి పోకూరు బయలుదేరిన రవీంద్ర చిట్యాల సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి బంధువులకు సమాచారం అందించారు.
గిద్దలూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. గిద్దలూరు నుంచి పోరుమామిళ్ల వెళ్లే బస్సుకి బ్రేకులు ఫెయిల్ అవడంతో బస్టాండ్‌లోని ప్లాట్‌ఫారంపైకి దూసుకొచ్చింది. దీంతో బస్టాండులోని ఫిల్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలో ఎండ తీవ్రత ఉద్ధృతంగా ఉంది. గురువారం ఉదయం నుంచే ఎండ తీవ్రతతో పాటు వేడిగాలులతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరయ్యారు. మార్కాపురంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా కనిగిరి, గిద్దలూరు, పామూరు తదితర మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంత మండలాల్లో ఎండలు మరింత అధికంగా ఉన్నాయి. ఎండలు మూడు రోజుల నుంచి పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
చంద్రబాబు వస్తేనే జాబు వస్తుందని సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. చీరాల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్‌కు మద్దతుగా చీరాల పట్టణంలోని జానకి సెంటర్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే టీడీపీ ప్రభుత్వం లభించే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ని చూడటానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది.
2024 ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా అభివృద్ధిపై ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లామని TDP అభ్యర్థులు.. తమ ప్రభుత్వ హయాంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేయడం, వేలల్లో ఇళ్ల స్థలాలతో పాటు జిల్లా ముఖచిత్రాన్ని మార్చామంటూ YCP అభ్యర్థులు అంటున్నారు. మరి ఎవరి హయాంలో ప్రకాశం అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
చీరాలలో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చీరల వాసులకు కీలక హామీలు ఇచ్చారు. చీరాలలో చేనేతలకు టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం. వాడరేవు బీచ్‌లకు పర్యాటక హబ్‌లుగా అభివృద్ధి. తాగునీటి సమస్య పరిష్కారం. తోటవారి ఎత్తిపోతల పథకానికి సురక్షిత నీరు అందించడం. పేరాల, వైకుంఠపురం రైల్వే బ్రిడ్జిల నిర్మాణం. చీరాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు రోడ్డు ప్రమాదం జరిగింది. తెనాలిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించి ఒంగోలు వస్తుండగా కొరిసపాడు మండలంలోని రేణింగవరం వద్ద కారు టైర్ పగిలి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
మంగళగిరికి చెందిన ఇద్దరు యువకులు స్నేహితులతో పాటు బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక సముద్ర తీరానికి బుధవారం విహారయాత్రకు వచ్చారు. వీరు సముద్రంలో మునుగుతూ ఉండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలల తాకిడికి ఇద్దరు సముద్రంలోకి వెళ్లిపోయారు. నీటిలో కొట్టుకుపోతున్న వీరిని అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు వెంటనే అప్రమత్తమై రక్షించి ఒడ్డుకు చేర్చి ప్రాణాలను కాపాడారు.
ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. వీరికి తోడుగా పార్టీ అధినేతలు జిల్లాకు క్యూ కట్టారు. ఏప్రిల్ 28, 30న జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. శుక్రవారం కనిగిరిలో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో పాల్గొననున్నారు. అదే రోజు పొదిలిలో చంద్రబాబు నాయుడు, గిద్దలూరులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఒకే రోజు జిల్లాలో పర్యటిస్తున్న తరుణంలో జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది.
Sorry, no posts matched your criteria.