India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ ర్యాలీలో పాల్గొన్న కానిస్టేబుల్ డి.ఎన్.బి. రత్నబాబు అలియాస్ గోపిపై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ ఉత్తర్వులు ఇచ్చారు. ఒంగోలులో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జస్వంతరావు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రత్నబాబుపై కేసు కూడా నమోదైంది.
పంగులూరు మండలం కొండ మంజులూరు పాలకేంద్రం వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పవరంకి చెందిన కిషోర్, అద్దంకికి చెందిన చందు, ముండ్లమూరుకి చెందిన ప్రవీణ్ లు ద్విచక్ర వాహనంపై ముప్పవరం వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో వాహనం చెడిపోవడంతో దానిని టోల్ ప్లాజా వద్ద ఉంచారు. అనంతరం నడిచి వెళుతున్న వారిని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పోస్టల్ బ్యాలెట్ అధికారుల సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 26 వరకు సమయం ఉందన్నారు.
జిల్లాలోని ఏపీ గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతులకు సంబంధించి ప్రవేశ పరీక్షను 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డును తెచ్చుకోవాలన్నారు.
కంభం మండలంలోని ఎర్రబాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఆటోలోని నాగయ్య(60) మృతి చెందడంతో పాటు మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యర్రగొండపాలెం సమీపంలో బుధవారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకొని రోడ్డు దాటుతున్న జంగా వెంకటలక్ష్మిని కమాండర్ కారు ఢీకొనడంతో మృతి చెందింది. తిరుపతిలో దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈమె యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెం నివాసి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గ్రామంలో ఉన్న బంధువులందరూ విలపించారు. కళ్లెదుటే కుటుంబ సభ్యురాలు చనిపోవడంతో వారు తట్టుకోలేకపోయారు.
యువ సినీ హీరో నిఖిల్ మామ, చీరాల టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం చీరాల వస్తున్నారు. కార్తికేయ-2 మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈమధ్య ఆయన తన బావ అమర్నాథ్, మహేందర్నాథ్ లతో కలిసి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ను కలుసుకోగా పార్టీ తరఫున ప్రచారం చేయాలని ఆయన కోరారు.
మార్కాపురంలో మంగళవారం హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. కొనకనమిట్ల మం, గుర్రాలమడుగుకు చెందిన కాశయ్య, కృష్ణ అన్నదమ్ములు. కాశయ్య కుమార్తె వీరమ్మ పుష్పాలంకణ వేడుక బుధవారం జరగనుంది. అందుకు సామగ్రి తెచ్చేందుకు వారు మార్కాపురం వెళ్లారు. తిరిగి వస్తుండగా రాయవరం సమీపంలో కారు వీరిని ఢీకొట్టగా, కాశయ్య అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో తండ్రి మృతిని చూసి ఆ చిట్టితల్లి గుండెలవిసేలా రోదించడం అందర్నీ కలచిచేసింది.
ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటు చేసుకుంది. ఒంగోలుకు తొలుత బీఆర్ గౌస్ పేరు ప్రకటించగా ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. మూడో జాబితాలో కొత్తపట్నం మండలానికి చెందిన దాసరి నాగలక్ష్మి ఖరారయింది. కొండపి సీటు తొలుత శ్రీపతి సతీశ్‌కు ఇచ్చారు. ఇప్పుడు పసుమర్తి సుధాకర్‌కు కేటాయించారు. అటు కనిగిరి సీటు కదిరి భవానికి కేటాయించగా ఇప్పుడు సుబ్బారెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
ఎస్పీ వకుల్ జిందాల్ ఎస్.ఎస్.టి బృందాలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఎస్.ఎస్.టి బృందాలు సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చెయ్యాలన్నారు. అక్రమంగా మద్యం, నగదు ఇతర వస్తువుల రవాణాను కట్టడి చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.