India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నియోజవర్గ ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.
ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి షర్మిల చేరుకున్నారు. ఆమంచి నామినేషన్ కార్యక్రమంలో షర్మిల పాల్గొంటారు. మరికాసేపట్లో పందిళ్లపల్లి నుంచి వేటపాలెం మీదుగా చీరాలకు ర్యాలీగా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చీరాల గడియారస్తంభం కూడలిలో సభలో షర్మిల ప్రసంగించనున్నారు.
జిల్లాలోని పలు పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన వేలంలో వెల్లంపల్లి, కొండపిలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266, ఒంగోలు-1 రూ. 265, ఒంగోలు-2 రూ. 261, టంగుటూరు రూ.263 చొప్పున పలికింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,374 బేళ్లు తీసుకురాగా, అందులో 2,683 బేళ్లు, ఎస్ఎల్ ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,534 బేళ్లురాగా, అందులో 2,697 బేళ్లను కొనుగోలు జరిగాయి.
చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. స్నేహలత తన తల్లి, కూతరితో కలిసి చిన్నగంజాం నుంచి బాపట్ల వెళ్తుండగా లారీని తప్పించబోయి కింద పడ్డారు. అదే సమయంలో లారీ వారిపై ఎక్కడంతో అన్విత(1), బోడు సుబ్బారావమ్మ(45) అక్కడికక్కడే మృతిచెందారు. తన కళ్లెదుటే కూతురు, తల్లిని కోల్పోవడంతో స్నేహలత ఆవేదన వర్ణణాతీతంగా మారింది.
కనిగిరి పట్టణానికి చెందిన షేక్ అల్తాఫ్, షేక్ అసిఫ్ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు. పట్టణంలోని ఓ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నారు. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కవల పిల్లలైన ఇద్దరు అన్నదమ్ములు 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించారు. ఒకేసారి జన్మించిన ఈ ఇద్దరూ ఒకే మార్కులతో పాస్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరిద్దరిని స్కూల్ యాజమాన్యంతోపాటు పలువురు అభినందించారు.
ప్రకాశం జిల్లాలో సోమవారం ఒంగోలు పార్లమెంట్, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 51 నామినేషన్లు దాఖలయినట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఒంగోలు పార్లమెంట్‌కు 4, ఒంగోలు అసెంబ్లీకి 5, యర్రగొండపాలెంకు 6, దర్శికి 4, సంతనూతలపాడుకు 6, కొండపికి 3, మార్కాపురానికి 5, గిద్దలూరుకు 5, కనిగిరి నియోజకవర్గానికి 3 నామినేషన్లు దాఖలయినట్లు తెలిపారు.
పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముహుర్త సమయానికి ఆలస్యమవుతుందని ఆర్వో కార్యాలయానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బైక్‌పై బయలుదేరారు. అప్పటికీ వెళ్లడానికి సాధ్యపడక ముహూర్త సమయానికి జనసేన ఇన్‌ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్, తదితరుల చేత నామినేషన్ పత్రాలను కార్యాలయానికి పంపారు.
జిల్లాలోని పీసీపల్లి మండలం ఇర్లపాడులో మిరపకాయలు కోసేందుకు కూలీలతో వెళ్తున్న ఆటో వెంగళాయపల్లిలోకి వచ్చేసరికి హఠాత్తుగా కుక్క రోడ్డుపైకి అడ్డంగా రావడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బరత్తమ్మ, గోవిందమ్మ, ఐ.జయమ్మ, సంపూర్ణ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను పీసీపల్లి వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స చేశారు. ఆనంతరం మెరుగైన చికిత్స కోసం 108లో కనిగిరి వైద్యశాలకు తరలించారు.
10వ తరగతి పరీక్ష ఫలితాలలో కనిగిరి పట్టణానికి చెందిన నాదెళ్ల సాయి దీక్షిత 595 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సాయి దీక్షితను అభినందించారు. జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘాలు విద్యార్థిని అభినందించారు.
సింగరాయకొండ బస్టాండ్‌లో సోమవారం భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో బస్టాండు సెంటర్‌లోని లగేజీ సెంటర్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ ప్రయాణికుడి వద్ద రూ.5లక్షల నగదును స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.