India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన వృద్ధుడు బాలయ్య(73) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. నల్లగుంట్ల సమీపంలో ఉదయాన్నే ఉపాధి హామీ పనికి వెళ్లిన బాలయ్య పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు గమనించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాలయ్యను తరలించారు. వైద్యలు పరీక్షించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
పీసీపల్లి మండలం వరిమడుగుకు చెందిన కొడవటిగంటి శాంసన్(34) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వెంగళాయపల్లి-దరిమడుగు గ్రామాల మధ్యలో ఆదివారం అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ బాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కనిగిరి వైద్యశాలకు తరలించారు.
అద్దంకి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా గట్టి పట్టు ఉన్న నేత, అన్ని మండలాలలో ఆయనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేదరమెట్ల గ్రామం లాంటి మేజర్ పంచాయతీలలో, ఆయనకు కుడి భుజంగా మెలిగే అనుచరవర్గం ఉంది. కరణం టీడీపీని వీడి వైసీపీలో కొనసాగుతూ ఉండటంతో.. అద్దంకిలో ఆయన వర్గీయులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారని నియోజకవర్గవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నెలకొంది.
దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. పోలీసులు వివరాల మేరకు ఆస్తి తగాదాలతో రాజా వెంకటేష్(32) అనే యువకుడిని చిన్నమ్మ కూతురు భర్త బంధువులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. చిన్నమ్మ కూతురుపై దాడికి యత్నించడంతో వెంకటేష్ అడ్డు రావడంతో కత్తులతో పొడిచి పరారయినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఈనెల 30న యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటించేలా షెడ్యూల్ ఖరారయింది. అదే రోజు లోకేశ్, బాలకృష్ణ పర్యటిస్తుండటంతో పర్యటన వాయిదా పడినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మే 3, 4వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తున్నట్లుగా తెలిపారు. 3న మార్కాపురం, 4న దర్శిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 3వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇటీవల ఒంగోలు కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు చేపట్టే ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.
జిల్లా ఎండ తీవ్రతతో మండిపోతోంది. ఆదివారం ఉదయం నుంచే ఎండ తీవ్రతతో పాటు వేడిగాలులతో ప్రజానీకం ఉక్కిరిబిక్కిరైంది. మార్కాపురం, కంభం, అర్దవీడులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అనేక మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమ ప్రాంత మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.
ఏపీ ఓపెన్ స్కూలు సొసైటీ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈవో సుభద్ర తెలిపారు. పరీక్షలు జూన్ 1 నుంచి 8వతేదీ వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని ఓపెన్ సొసైటీ స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లు ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు వివరాలను తెలియజేయాలని చెప్పారు.
చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులో భారీ మద్యం డంపును సెబ్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన గంగిరేగుల వెంకట్‌రావు గోవా నుంచి తెచ్చిన 180ML బాటిళ్లు 1001లను మరోచోటకి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు సెబ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విలేకరులతో మాట్లాడుతూ.. అతని కాల్ డేటా ఆధారంగా మిగిలిన నిందితులను గుర్తించి కేసు నమోదు చేస్తామని చెప్పారు.
తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారిలోని సీతానాగులవరం గ్రామం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోపడి చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్లుపాడు ఎస్సై వేముల సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.