Prakasam

News April 27, 2024

ఒంగోలు పార్లమెంట్ అప్‌డేట్స్

image

➤ మొత్తం ఓటర్ల సంఖ్య: 18,22,470➤ పురుషుల ఓటర్లు: 9,07,980➤ మహిళా ఓటర్లు: 9,23,374➤ఇతరులు: 111➤పోలింగ్ బూత్‌ల సంఖ్య: 2187అభ్యర్థులు:-➤ వైసీపీ అభ్యర్థి: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి➤ కూటమి అభ్యర్థి: మాగుంట శ్రీనివాసులు రెడ్డి➤ కాంగ్రెస్ అభ్యర్థి: సుధాకర్ రెడ్డి

News April 27, 2024

అమెరికా యూనివర్సిటీ ఎన్నికల్లో అద్దంకి వాసి

image

అమెరికాలో యూనివర్సిటికీ సంబంధించిన ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలలో ఏపీకి చెందిన రోహిత్ శ్రీసాయి బాచిన అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. వీరి స్వగ్రామం అద్దంకి నియోజకవర్గం జె. పంగులూరు గ్రామం. వీరి తండ్రి బాచిన హనుమంత రావు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఏపీ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారు.

News April 27, 2024

30న టంగుటూరు రానున్న సీఎం జగన్

image

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు టంగుటూరులో జరగనున్నట్లు రాష్ట్ర మంత్రి, కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. వైసీపీ శ్రేణులు ముందుగా కొండపిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని షెడ్యూలు విడుదల చేశారు. అయితే సీఎం పర్యటనకు, జన సమీకరణకు టంగుటూరు అనుకూలంగా ఉంటుందని భావించి మార్చినట్లు మంత్రి సురేశ్ తెలియచేశారు.

News April 27, 2024

ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ ఆమోదం

image

చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్‌ను చీరాల నియోజకవర్గ ఎన్నికల అధికారి సూర్యనారాయణరెడ్డి శనివారం ఆమోదించారు. ఆమంచి కృష్ణమోహన్‌కు రూ.4.63 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు పలువురు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమంచి నామినేషన్‌ను ఆర్ఓ పెండింగ్‌లో ఉంచారు. శనివారం విద్యుత్ బకాయిలపై ఆమంచి వివరణ ఇవ్వడంతో నామినేషన్ ఆమోదించారు.

News April 27, 2024

ఒంగోలు: రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి

image

బీపీఈడీ, డీపీఈడీ విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం మే 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కేఎస్. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయినా విద్యార్థినీ, విద్యార్థులు రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రాలు కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News April 27, 2024

ప్రకాశం: రూ.2.21 కోట్ల నగదు సీజ్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈనెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2.21 కోట్ల నగదు, 3000 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఇప్పటివరకు రూ.4.92 కోట్ల మేరా ఖర్చు చేసినట్లు గుర్తించామన్నారు. శుక్రవారం వరకు 62 వాలంటీర్లను తొలగించగా, 2,714 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 27, 2024

మాజీ MLA ఆమంచి నామినేషన్‌పై ఉత్కంఠ

image

చీరాల కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన నామినేషన్ చెల్లుబాటు విషయం సందిగ్ధంగా మారింది. ఆమంచికి చెందిన ముఖ్యమైన డాక్యుమెంట్లతో పాటు, క్రిస్టల్ సీఫుడ్స్ ఫ్యాక్టరీకి విద్యుత్ బకాయిలు ఉన్నాయని అభ్యంతరాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆర్వో సూర్యనారాయణరెడ్డి ఆమంచి నామినేషన్ పెండింగ్లో ఉంచారు. శనివారం ఉదయం 10లోపు వాటిని సబ్మిట్ చేయాలని సూచించారు. దీంతో ఆమంచి నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది.

News April 27, 2024

ప్రకాశం: రూ.20 లక్షలు స్వాధీనం

image

జిల్లాలోని పుల్లలచెరువు మండలం మల్లపాలెం చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం రూ.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి ఒంగోలుకు కారులో తీసుకెళ్తున్న అజీజ్ అనే వ్యక్తి నుంచి ఆ డబ్బును గుర్తించి, సరైన పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రూ.50 వేలకు మించి డబ్బులు ఉంటే సరైన పత్రాలు చూపించాలన్నారు.

News April 26, 2024

కొండపి: ఒకే రోజు అటు జగన్, ఇటు బాలకృష్ణ

image

కొండపి నియోజకవర్గంలో ఒకే రోజు సీఎం జగన్, నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న మర్రిపూడిలోని బస్టాండ్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అదేరోజు కొండపిలో సీఎం జగన్ పర్యటిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇద్దరి పర్యటనలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News April 26, 2024

ఇన్‌ఛార్జ్ డీపీవో నన్ను బెదిరించారు: మద్దిపాడు ఈవోఆర్డీ

image

‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్‌ఛార్జ్ ‌డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో దాతల సహకారంతో గతంలో ఆర్వో ప్లాంట్ నిర్మించి పంచాయతీకి అప్పగించినా ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో మీటర్ కాలిపోయింది. దాని మరమ్మతుల కోసం ఓ మంత్రి జోక్యం చేసుకోవడం, అధికారుల మధ్య కోల్డ్ వార్ నేపథ్యంలో ప్లాంట్ వివాదం ముదిరింది.