India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజిల్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలను ప్రింట్ తీసుకోని తమ వద్ద ఉంచుకోవాలన్నారు.
కరెంట్ షాక్‌తో నాలుగు గేదెలు మృతి చెందిన ఘటన కురిచేడు మండలంలో సోమవారం జరిగింది. గంగదొనకొండ గ్రామంలో గోదాల సుబ్బారెడ్డి, కర్నాటి పెద్ద వెంకటరెడ్డి, బెండయ్య గేదెలు పొలాల్లో గడ్డి తింటుండగా మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో సమీపంలో ఉన్న పొలాలలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గేదెలు వాటిని తగలండంతో నాలుగు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
బాపట్లలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. బాపట్లలోని కలెక్టరేట్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజు కూడా శాంతి భద్రతలకు సహకరించాలన్నారు.
పర్చూరు మండలంలో నిన్న మొన్నటి వరకు కోడి గుడ్డు ధర రూ.5ల వరకు ఉండగా నేడు రూ.8కు ఎగబాకింది. ఎండాకాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు. ప్రస్తుతం పర్చూరులో 30 గుడ్ల ధర రూ.200 పలుకుతున్నాయి. హోల్ సేల్లో ఒక కోడిగుడ్డు రూ.6.5లు కాగా రిటైల్ మార్కెట్లో రూ.8 రూపాయలు పలుకుతోంది.
కౌంటింగ్ నేపథ్యంలో బాపట్ల జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ సామాన్య ప్రజలకు, మహిళలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఒక్కరోజే 266 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసులు నమోదు చేశామన్నారు.
చెరువులో చేపలు పట్టేందుకు వెళ్ళి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇంకొల్లు మండలం నలతోటివారిపాలెంలో సోమవారం చోటు చేసుకుంది. గంగవరం గ్రామానికి చెందిన యాడికిరి సుబ్రహ్మణ్యం (50) చేపలు పట్టేందుకు చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మల్లిఖార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్పీ సుమిత్ గరుడ్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు
సోమవారం పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాల జోలికెళ్లకుండా బుద్ధిగా జీవించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోవాలని, సత్ప్రవర్తన ఒక్కటే మంచి మార్గమన్నారు.
ఇంకొల్లు మసీదు కాంప్లెక్స్‌లో చికెన్ పకోడీ దుకాణంలో పనిచేస్తున్న షేక్ నాగూర్ వలి (40) సోమవారం మృతి చెందారు. నాగూర్‌వలి చికెన్ దుకాణంలో పనిచేస్తూ షాపులోనే ఉంటున్నాడు. రోజు లాగానే యాజమాన్యం వచ్చి చూసేసరికి బల్లపై పడుకున్న వ్యక్తి కింద పడి ఉన్నాడు. దీంతో యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఇంకొల్లు ఎస్సై మల్లికార్జునరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లాలో సైనిక దళాల్లో పనిచేసే వారు 6,677 మంది ఉండగా, వారి కుటుంబ సభ్యులు 173 మందికి కూడా ఓటు హక్కు ఉంది. ఇప్పటికే వారందరికీ పోస్టల్ బ్యాలెట్లను తపాలా శాఖ ద్వారా పంపారు. వారు ఓటేసి తిరిగి పోస్టల్ ద్వారా ఆయా నియోజకవర్గ కేంద్రాలకు, లేదా ఎన్నికల అధికారైన జిల్లా కలెక్టర్ అడ్రసుకు పంపాలి. జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రానికి 1477 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు సమయానికి వస్తేనే పరిగణనలోకి తీసుకుంటారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల మార్కుల మెమోల్లో దొర్లిన పొరపాట్లను సవరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల మెమోల్లోని తప్పులు, పొరపాట్లపై విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని డీఈవో సుభద్ర చెప్పారు. తప్పుల సవరణకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలోని మాణిక్యాంబ 9919510766 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.