India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ అడ్మిషన్లపై షెడ్యూల్ ను బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ విడుదల చేసినట్లు ఆర్ ఐవో సైమన్ విక్టర్ తెలిపారు. అడ్మిషన్లను రెండు దశల్లో నిర్వహిస్తారు. మే 15 నుంచి కళాశాలల్లో దరఖాస్తులు విక్రయిస్తారు. మే 22నుంచి విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు. రెండో దశ అడ్మిషన్లకు జూన్ 10నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 1కి అడ్మిషన్లు పూర్తి చేయాలి.
ప్రకాశం జిల్లాలో వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఈ క్రమంలో జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి ఓటు హక్కు నమోదు కోసం 8,320 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. వీటిని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి సంబంధిత బిఎల్ఓలకు పంపారు. వారం రోజుల్లో ఓటు హక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను విచారణ చేసి అర్హత ఉంటే ఓటు హక్కు కల్పించనున్నారు.
జిల్లాలోని అర్దవీడు మండలం మొహిద్దీన్ పురంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలో 2 గంటల సమయంలో గొర్రెల దొంగతనానికి వచ్చి దొంగలు గొర్రెల కాస్తున్న దంపతులపై దాడి చేశారు. ఈ దాడిలో గొర్రెల కాపరికి స్వల్ప గాయాలు కాగా.. భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మంగళగిరి హస్పిటల్‌కు తరలించారు
రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18న ఎన్నికల కమిషన్ జారీ చేస్తుందని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్స్ స్వీకరిస్తామని తెలిపారు. 26న నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్‌కు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.
జిల్లాలోని కురిచేడు మండలం మర్లపాలెం వద్ద రైల్వే ట్రాక్‌పై ఉన్న పాత పట్టాలను లారీలోకి లోడు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఒకటి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం బిహార్‌కు చెందిన అనిష (40) రైలు పాత పట్టాలను లారీకి లోడ్ చేస్తుండగా, అతనిపై రైలు పట్టా జారి పడింది. క్షతగాత్రుడిని దర్శి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.
‘నన్ను ఆదరించి ఎంపీగా గెలిపించండి. భయంతో, బాధ్యతతో పని చేస్తాను’ అని ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. కొమరోలులో సోమవారం రాత్రి వైసీపీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ ఎన్నికల్లో పోటీ చేయటానికి సింగిల్‌గా సింహంలా వస్తున్నాడని, చంద్రబాబు పొత్తు పెట్టుకుని వస్తున్నాడని చెప్పుకొచ్చారు.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తో కలిసి గిద్దలూరు ఎంఆర్వో ఆఫీసు విజిట్ చేశారు. ఈసందర్భంగా ఆర్వో నాగజ్యోతి ద్వారా ఎన్నికల పర్యవేక్షణపై చేపట్టిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
పర్చూరులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పర్చూరు నుంచి పెద్దివారిపాలెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న రావి విజయ భాస్కర్‌ని ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన ఇరువురిని 108లో గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో విజయ భాస్కర్ మృతి చెందగా, మరొక వ్యక్తి చికిత్స పొందుతున్నారు.
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ (క్రైమ్) శ్రీధర్ రావు సోమవారం తెలిపారు. ఒంగోలులో గత కొన్ని రోజులుగా బైక్ దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో నిఘా ఉంచారు. సోమవారం ఒంగోలు రైల్వే స్టేషన్ పరిధిలో ఇద్దరు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించి, వారి వద్ద నుంచి 10 బైకులు స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 300 మంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్టీ గురుకుల పాఠశాలలో కొన్నేళ్లుగా ఉపాధ్యాయలుగా పనిచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతన పద్ధతి అమలు కానప్పటికి, ఇస్తున్నటువంటి రూ.15 వేలు, నెల నెల జీతం అందడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మార్చి నెల జీతాన్ని విడుదల చేయవలసిందిగా ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.