India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉలవపాడు మండలం తెట్టు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ట్రాక్ సిబ్బంది గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆకుపచ్చ రంగు చీర ధరించినట్లు తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన చివరి అవకాశం నేటితో ముగియనుంది. ప్రకాశం జిల్లాలోని 18 సంవత్సరాల నిండిన యువతీ, యువకుల్లో ఓటర్ కార్డు లేని వారు ఆన్లైన్లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఈ అవకాశం కోల్పోతే మళ్లీ 5 సంవత్సరాల వరకు ఆగాల్సిందేనన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక ఈనెల 16న కందుకూరులోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సోమినేని సురేష్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎంపిక ప్రారంభమవుతుందన్నారు. 2006 జూన్ 1వ తేదీ తరువాత జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలన్నారు.
తర్లుపాడు మండలం గొల్లపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మార్కాపురం మండలం మిట్టమీదపల్లికు చెందిన వెంకటేశ్వరరెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
ఇడుపులపాయ IIITలో చదువుతున్న కంభం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారంరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుర్రి పుల్లయ్య కూతురు కుర్రి రేఖ (21) మెకానికల్ ఇంజినీరింగ్ 4వ సంవత్సరం చదువుతోంది. ఈ విషయం కాలేజీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
బేస్తవారిపేట మండలంలో ఆదివారం అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న బాలిక తన స్నేహితురాలు వద్దకు పుస్తకాల కోసం వెళ్లగా అక్కడే ఉన్న పిచ్చయ్య అనే ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లి వాపోయారు. బాలికను బలవంతంగా తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రోడ్లు వేయలేని పాలకుల అసమర్థతను నిరసిస్తూ ఆ గ్రామస్థులు రానున్న ఎన్నికలను బహిష్కరించారు. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఫ్లెక్సీని గ్రామంలో అంటించి తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. సీఎస్ పురం మండలంలోని దర్శిగుంట్ల పంచాయతీ పరిధిలోని బొంతవారిపల్లిలో గ్రామస్థుల ఆవేదన చర్చనీయాంశమైంది.
ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతిరోజు 38 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇళ్లకే పరిమితమైపోతున్నారు. ఒకవైపు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తుంటే మరి వైపు భానుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కుపోతకు గురవడంతో పాటు వృద్ధులు, చిన్న పిల్లలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన గిద్దలూరు పట్టణ సమీపంలో ఎడవల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్నది. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఖాజావలి (38) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొనటంతో తీవ్ర గాయాలతో ఖాజావలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీఎం జగన్‌పై విజయవాడ బస్సు యాత్రలో దాడి జరిగిన విషయం తెలిసింది. దీనిపై ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు స్పందించారు. జగన్‌పై దాడి టీడీపీ మూకల పనేనని జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, శివ ప్రసాద్ అన్నారు. జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆధరణను చూసి ఓర్వలేక దాడి చేశారని జంకె వెంకటరెడ్డి, కేపీ నాగార్జునరెడ్డి, దద్దాల అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి మంచి పరిణామాలు కాదని అన్నా రాంబాబు హితవు పలికారు.
Sorry, no posts matched your criteria.