India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంతమాగులూరు ఎంపీడీవో కార్యాలయ సమీపంలో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రమైన ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు పాఠశాలలోపలికి వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దెబ్బతినగా ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పర్చూరు ఇందిరా కాలనీకి చెందిన షేక్ ఖాసిం సైదా రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని శనివారం స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రధాన రాజకీయ పార్టీ కూడా పర్చూరులో తిష్ట వేసిన సమస్యలను పట్టించుకోవడం లేదని, పేదలకు చేస్తున్నది ఏమీ లేదని ఆరోపించారు. స్థానికుడైన తనకు నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని, పేదల బాధలు తనకు తెలుసునని చెప్పారు. అందుకే పేదల ప్రతినిధిగా పోటీకి దిగుతున్నానన్నారు.
ప్రకాశం జిల్లా సముద్ర జలాల్లో పడవలు, మరబోట్ల ద్వారా నిర్వహించే చేపలవేటపై 61 రోజుల నిషేధం ఈనెల 15 నుంచి అమల్లోకి రానుందని జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సముద్రంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధం విధించినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు మత్స్యకారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా వారికి ప్రభుత్వం అందించే రాయితీలను నిలిపివేస్తామన్నారు.
దొనకొండ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఇర్ఫాన్ (38) అనే వ్యక్తి ఒంగోలు ఇస్లాంపేటలో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో సరదాగా కొత్తపట్నం కె.పల్లెపాలెం బీచ్ కు వచ్చి సముద్రంలో స్నానం చేస్తూ అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోతుండగా మత్స్యకారులు బయటకులాగారు. కొన ఊపిరితో ఉండగా, స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పటిష్ఠ చర్యలు చేపట్టామని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీ గోపాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఈనెల 11 నాటికి మొత్తం 18,17,162 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.1.30 కోట్ల విలువైన డబ్బు, మద్యం, తదితర వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించి పోటీ చేసే అభ్యర్ధులకు అవసరమైన సూచనలు సలహాలను ఇచ్చేందుకు జిల్లాలోని అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభవుతుందని, ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
దర్శి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బూచేపల్లి కుటుంబం రుణపడి ఉంటామన్నారు. తనను ఆశీర్వదించేందుకు మహిళలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
ఇంటి నిర్మాణానికి తెప్పించుకున్న ఇసుక లోడ్‌లో మృతదేహం రావడం కలకలం రేపింది. చీరాల మండలం ఈపూరుపాలెంలో మాజీ ప్రజా ప్రతినిధి పద్మనాభునిపేటలో నిర్మిస్తున్న కొత్త ఇంటికి అవసరమైన ఇసుకకు ఆర్డర్ ఇవ్వగా శుక్రవారం ఉదయం లోడ్ వచ్చింది. ఇసుకను దింపుతుండగా అందులో తల లేని ఒక యువకుడి మృతదేహం బయటపడడంతో అందరూ భయభ్రాంతులయ్యారు. ఎలా ఇసుకలోకి ఈ మృతదేహం వచ్చిందో ఎవరికి అంతు పట్టడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లో 18,349 మందికి 10,868 మంది పాసయ్యారు. దీంతో 59 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 15,238 మందికి 10,993 మంది విద్యార్థులు పాసయ్యారు. 72 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 15వ స్థానం సాధించింది. మొదటి సంవత్సరం కంటే ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో మెరుగైన ఫలితాలు వచ్చాయి.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయని ఆర్ ఐవో సైమన్ విక్టర్ చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను 39,377మంది రాశారు. వీరిలో 19,233 మంది మొదటి సంవత్సరం, 18,128 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం కొన్ని నిమిషాలలో తేలనుంది. ఇప్పటికే విద్యార్థులు ఫలితాల కోసం నెట్ సెంటర్ల వద్దకు చేరారు.
Sorry, no posts matched your criteria.