India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆమంచి కృష్ణమోహన్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వైసీపీ నాయకులు హెచ్చరించారు. చీరాలలో పట్టణ అధ్యక్షుడు కొండ్రు బాబ్జి మాట్లాడుతూ.. చీరాలను ప్రశాంత వాతావరణంలో పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ప్రజలు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి సాగనంపారని, అదే సీను 2024 ఎన్నికల్లో మరోసారి చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఇంట్లో వారు మందలించారనే మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చీరాల మండలం వాడరేవులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శివకుమార్ వివరాల మేరకు.. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన ఎం.నాగేంద్ర(23) చీరాలలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఉద్యోగానికి వెళ్లకపోవడంతో ఇంట్లో వారు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ప్రకాశం జిల్లాలో గురువారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ సమీపంలో ఉన్న చెక్ పోస్టును ఆయన తనిఖీ చేశారు. రోజువారి నిర్వహిస్తున్న రిజిస్టర్‌ను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్, జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.
ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్‌కు అనుగుణంగా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆదేశించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ నోడల్ అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని, ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టాలన్నారు.
జిల్లాలోని రాచర్ల మండలం అనుములపల్లిలో ఉపాధి పనికి వెళ్లిన కూలీ గల్ల ఆంజనేయులు (55) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పనిచేస్తుండగా ఆంజనేయులుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మిగతా కూలీలు గమనించి హుటాహుటిన రాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఆంజనేయులు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.
ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో సమతానగర్ పరిధిలోని వాలంటీర్ సుజన ప్రియా ఫిర్యాదు మేరకు 30 మంది TDP నేతలపై గురువారం పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వాలంటీర్‌తో కలిసి YCP నేతలు ప్రచారం చేస్తున్నారని కొందరు ఫొటో తీశారు. దీనిపై రగడ జరగడం, ఆ వార్డు టీడీపీ బాధ్యుడు మోహన్ రావు అక్కడికి వెళ్లడంతో గొడవ పెద్దదైంది. అనంతరం రిమ్స్‌లో ఇరు వర్గాల కవ్వింపు చర్యల నేపథ్యంలో TDP నేతలపై కేసు నమోదైంది.
ఎస్పీ సుమిత్ సునీల్ కార్యాలయం ఎదుట ఒంగోలు TDP అభ్యర్థి దామచర్ల జనార్దన్ బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. నగర పరిధిలోని సమతానగర్‌లో వాలంటీర్‌తో కలిసి YCP నేతలు ప్రచారం చేస్తుండడంతో కొందరు ఫొటో తీశారు. దీనిపై రగడ జరగడంతో 37వ వార్డు టీడీపీ బాధ్యుడు మోహన్ రావు అక్కడికి వెళ్లడంతో వారంతో దాడిచేశారు. దీంతో అతడికి తీవ్ర రక్త స్రావం అయింది. టీడీపీ అభ్యర్థి జనార్దన్ ఎస్పీ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు.
పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బెంగళూరులో కలిశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు తొలిసారిగా చీరాల అసెంబ్లీ టికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన షర్మిలకు గుర్తు చేశారు. తన చేరికకు వీలుగా చీరాల రావలసిందిగా ఆమంచి ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
దర్శి నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను దర్శి నియోజకవర్గం కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆయన నివాసంలో బుధవారం కలిశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆహ్వానం మేరకు గొట్టిపాటి లక్ష్మి కలిసినట్లు స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేను గొట్టిపాటి లక్ష్మి కలవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గ్రానైట్ కు నిలయమైన చీమకుర్తి పట్టణంలో గంజాయి భూతం జడలు విప్పుతోంది. ఇటీవల బడ్డీ బంకుల్లో సైతం గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. తాజాగా 2.6 కేజీల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చీమకుర్తిలో ఎస్ఈబీ డీఎస్పీ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.