India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవలే పదో తరగతి పరీక్షలు అయిపోయిన విషయం విధితమే. తాజాగా మూల్యాంకనం నిర్వహించారు. చీరాలకు చెందిన ఓ విద్యార్థి ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాశాడు. దీంతో విస్తుపోయిన టీచర్ దానిని పై అధికారులకు చూపించారు. అయితే ఈ విద్యార్థికి వందకు 70 మార్కులు రావడం విశేషం. మరో సబ్జెట్‌లో మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది. అని రాయడంతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు.
కొండపి మండలం, కట్టుబడిపాలెం-వెన్నూరు గ్రామాల మధ్య మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. గోగినేనివారిపాలెంకు చెందిన గోగినేని శాంతి తన కూతురు యశ్విత లక్ష్మి(9), కుమారుడు దేవాన్ష్‌తో కలిసి స్కూటీపై గ్రామానికి వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యశ్విత లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణబాజీబాబు చెప్పారు.
చీరాలలో రాజకీయం రోజురోజుకీ ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన YCP నుంచి కరణం వెంకటేశ్, TDP నుంచి కొండయ్య పోటీ పడుతుండగా ప్రచారం కూడా ముమ్మరం చేశారు. అయితే వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో చీరాలలో త్రిముఖ పోటీ తప్పదని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే చీరాల నుంచి రెండు సార్లు గెలిచిన ఆమంచికి బలమైన కేడర్ ఉన్నా TDP, YCPపై గెలిచేనా?
ప్రకాశం భవనంలోని స్పందన హాలులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు.
సంతమాగులూరు మండలంలో రేపు సీఎం జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర జరగనుంది. 12వ రోజు యాత్రలో భాగంగా జగన్ గంటవారిపాలెం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్నారు. జిల్లా పరిధిలోని వెల్లలచెరువు, కామేపల్లి పుట్టవారిపాలెం జంక్షన్‌లలో ఈ యాత్ర సాగనుందని పార్టీ నేతలు తెలిపారు. విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారని చెప్పారు.
శ్రీశైలానికి కాలినడకన వచ్చి వెళుతున్న కన్నడ వాసుల సౌకర్యార్థం విజయవాడ నుంచి గిద్దలూరు మీదుగా హుబ్లీకి ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 10న విజయవాడలో రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.48 గంటలకు గిద్దలూరుకు చేరుకుంటుందన్నారు. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు హుబ్లీ చేరుతుందని చీఫ్ కమర్షియల్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం మధ్యాహ్నం తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి.. ఏడాది పాటు పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అయితే ఆయనకు చీరాల టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ జిల్లా అంతటా తీవ్ర ఆసక్తిగా మారింది.
కూలి పనులకి ఆటోలో వెళుతుండగా ప్రమాదవశాత్తు మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చీరాల వేటపాలెం బైపాస్ రోడ్డులో జరిగింది. చేనేతపురికి కాలనీకి చెందిన మస్తానీ కొందరు కూలీలతో కలిసి వ్యవసాయ పనులకు ఆటోలో బయలు దేరారు. ఆటోలో వెనుక వైపు కూర్చున్న ఆమెకు ఎద్దుల బండిలో తరలిస్తున్న రేకులు ప్రమాదవశాత్తు కడుపులో దిగాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది.
2009లో కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి రవి కుమార్ 15,764 ఓట్లు మెజార్టీతో విజయం సాధించగా.. 1999లో టీడీపీ నుంచి బి.గరటయ్య కేవలం 249 ఓట్లతో గెలిచారు. అద్దంకిలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా.. గొట్టిపాటికి వచ్చిన 15,764 ఓట్ల మెజార్టీనే అత్యధిక రికార్డు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి హనిమిరెడ్డి, కూటమి నుంచి మరోసారి గొట్టిపాటి బరిలో ఉన్నారు. ఈయన రికార్డును హనిమిరెడ్డి బ్రేక్ చేయగలరనుకుంటున్నారా.
అనారోగ్యంతో వృద్ధుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాళ్లూరు పట్టణములోని కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కోటారామిరెడ్డి (75) కొంతకాలంగా నరాల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. ఇరుగుపొరుగువారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.