India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. మున్సిపాలిటీలోని మూడో వార్డు బూత్ నంబర్ 126లో నమోదైనా.. ఓటు వేయలేదు. నియోజకవర్గానికి ప్రథమ పౌరులైన తన ఓటు హక్కును వినియోగించుకోకపోవడంతో ప్రజాస్వామ్యవాదులు పలు విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎమ్మెల్యే వినియోగించుకోకపోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.
కనిగిరి మండలం ఎడవల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రాలీ ఆటో ఢీకొనడంతో 8 మందికి గాయాలయ్యాయి. కనిగిరి నుంచి పొదిలి వైపు ప్రయాణికులతో వెళుతున్న ట్రాలీ ఆటో హైదరాబాదు నుంచి పామూరుకు వస్తున్న కారును ఎడవల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఢీకొట్టిన్నట్లు బాధితులు తెలిపారు. 108 ద్వారా క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఐపీఎల్ తరహాలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు సింగరాయకొండ యువకుడు సెలక్ట్ అయ్యాడు. గురువారం వైజాగ్‌లో ఏపీఎల్ వారు నిర్వహించిన వేలంలో మన సింగరాయకొండ చెందిన చెమట సురేంద్ర కృష్ణ గోదావరి టీమ్‌కు సెలక్ట్ అయ్యాడు. ఏపీఎల్ మ్యాచ్‌లు వైజాగ్‌లో వచ్చే నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇవాళ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల సంస్థ ప్రకటించింది. దీనితో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. చెట్ల కింద ఉండవద్దని, జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిస్తే అవకాశం ఉందని ప్రకృతి విపత్తుల సంస్థ అధికారులు తెలిపారు.
జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడులో పారాబత్తిన మాల్యాద్రికి చెందిన గొర్రెల దొడ్డిలోని 18 గొర్రెలు కుక్కలు దాడిలో మృతి చెందాయి. వాటి ఖరీదు సుమారు 1.5 లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. గ్రామాలలో ఊరకుక్కలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెలిగండ్ల మండలం పందువ గ్రామంలో ఎస్సీ పాలెంకు చెందిన జుటికే తిమోతి టీడీపీకి ఓటు వేశాడని అదే గ్రామానికి చెందిన గురవయ్య కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి భాగానికి నాలుగు కుట్లు పడ్డాయి. బాధితుడు తిమోతి గురువారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన 8 నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ ఏ.ఎస్ దినేష్ కుమార్ పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, పలువురు పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న అధికారులకు వారు పలు సూచనలు జారీ చేశారు.
తోటి పిల్లలతో ఆడుకుంటున్న చిన్నారిపై క్షణాల్లోనే విధి వక్రీకరిచింది. పెద్దారవీడు మండలం ఏనుగులదిన్నెపాడులో గురువారం ఓ చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. అహరోను, జానకి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె (4). గురువారం కుమార్తె తోటి పిల్లలతో ఆడుకుంటూ అటుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ టైర్ కింద పడింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.
చినగంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట వద్ద లారీని ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, గాయపడిన 30 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన 20 మంది చినగంజాం వాసులే.
2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ర్ట ప్రజలకు ప్రకాశం జిల్లా స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రంలోనే దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91% పోలింగ్ నమోదైంది. 2,26,370 ఓటర్లలో 2,05,792 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు పార్లమెంట్ పరిధిలో ఒంగోలు 87.06శాతం పోలింగ్‌తో రికార్డు సృష్టించింది. 16,07,832 మందికి గాను 13,99,707 మంది ఓటేశారు. రాష్ట్రంలో ఇదే అత్యధికం. ఓవరాల్‌గా జిల్లాలో 87.09% నమోదైంది.
Sorry, no posts matched your criteria.