India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుండెలు పిండే హృదయ విదారక సంఘటన బుధవారం పసుమర్రు వద్ద జరిగిన అయిన విషయం తెలిసిందే. కాశీబ్రహ్మేశ్వరరావు, లక్ష్మి దంపతులకు భావన, పూజిత కుమార్తెలు. తల్లిదండ్రులతో భావన, సోదరి కుమార్తె ఖ్యాతిశ్రీతో సొంతూరుకి వచ్చి ఓటేసి ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా బస్సు లారీని ఢీకొనడంతో మంటలు అంటుకున్నాయి. భావన బస్సు కిటికీలో నుంచి దూకి ప్రాణాలతో బయటపడగా, తల్లిదండ్రులు, ఖ్యాతిశ్రీ, ఇంకో నలుగురు సజీవదహనం అయ్యారు.
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో 600 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఎంపికైన వారు వారికి కేటాయించిన పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీ లోపు సర్టిఫికెట్లు సమర్పించి ప్రవేశం పొందాలన్నారు. మిగిలిన సీట్లను రెండో విడత లాటరీలో ఎంపికైన విద్యార్థులతో భర్తీ చేస్తామని సుభద్ర తెలిపారు.
చిన్నగంజాం నుంచి బయలుదేరిన బస్సు రోడ్డు ప్రమాదానికి గురి కావడం తీవ్ర దిగ్భ్రాంతికి కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పసుమర్రు దగ్గర బస్సు, టిప్పర్ ఢీకొని అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమని అన్నారు. అక్కడ బైపాస్ రోడ్డు పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రతా చర్యలు తీసుకోవడం, వేగ నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని పేర్కొన్నారు.
కారంచేడు మండల పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట నుంచి వాడరేవు వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. చిలకలూరిపేట నుంచి వాడరేవుకు కారులో ఓ కుటుంబం బుధవారం బయలుదేరింది. మార్గమధ్యలో కారు నడుపుతున్న అతనికి గుండె నొప్పి రావడంతో కారు అదుపుతప్పిందని కుటుంబీకులు తెలిపారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు 108 సాయంతో అతన్ని చీరాలలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలి బుధవారం కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ సందర్భంగా కారు అదుపు తప్పి దేవరాజు గట్టు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరిగినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉలవపాడు మండలంలోని అంతర్రాష్ట్ర సపోటా మార్కెట్లో మంచి ధరలు పలుకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫారిన్ రకం రూ.800, పాల రకం రూ.700, బిళ్ల రకానికి రూ.550 పలుకుతున్నాయి. రోజుకు 1,000 నుంచి 1,200 బస్తాల వరకు ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్ ప్రారంభం నుంచి బస్తాకు రూ.200 చొప్పున పెరిగిందని రైతులు చెబుతున్నారు.
మర్రిపూడి మండలం శివరాయునిపేటకు చెందిన మానివేల చిన్నవీరయ్య, చీమల వెంకటేశ్వర్లు బైక్ పై ఉప్పలపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో మర్రిపూడి మండలం చిమటకు చెందిన జానపల్లి వెంకటేశ్వర్లు బైకుపై మర్రిచెట్లపాలెం వెళ్తున్నారు. ఉప్పలపాడు సమీపంలో బైక్ లు ఢీకొనడంతో చిన్నవీరయ్యకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై కోటయ్య కేసు నమోదు చేశారు.
ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదంతో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. అయితే, వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. చినగంజాం మండలం నీలాయిపాలెంకు చెందిన ఉప్పుగుండూరు కాశీ (65), లక్ష్మి (55), చిన్నారి సాయిశ్రీ (8) మృతి చెందారు. ఒకేసారి కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు గుండా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 17 నుంచి 31 వరకు గుంటూరు-గుంతకల్లు డంప్లింగ్ పనుల కారణంగా (17329/17330) హుబ్లీ నుంచి విజయవాడ, (17251/17252) గుంటూరు నుంచి కాచిగూడ వంటి రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కావున రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు.
పొదిలి మండలం సలకనుతల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొనడంతో శ్రీశైలం-ఒంగోలు జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభంతో పాటు వైర్లు నేలకు ఒరిగాయి. ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారుకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Sorry, no posts matched your criteria.