India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యద్దనపూడి మండలం పూనూరు గ్రామంలో విషాద ఘటన చేటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకొండ మేరి (28) పోతురాజు దంపతులు పరదాల వ్యాపారం నిమిత్తం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఎన్నికల్లో స్వగ్రామంలో ఓటేసేందుకు గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై పూనూరుకు బయల్దేరారు. ఈ క్రమంలోనే కామారెడ్డి వద్ద ప్రమాదానికి గురై, మేరి మృతి చెందినట్లు సమాచారం అందిందని బంధువులు వెల్లడించారు.
ఓటు శక్తివంతమైన ఆయుధమని, ఓటు ద్వారా మన తలరాతను మార్చవచ్చని హీరో నిఖిల్ సిద్ధార్థ్ అన్నారు. చీరాల మండలం జాండ్రపేట హైస్కూల్ వద్ద నుంచి గడియార స్తంభం వరకు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో 2కే రన్ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గరటయ్య, చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య తనయుడు గౌరీ అమర్నాథ్ తో కలిసి హీరో నిఖిల్ పాల్గొంటున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో ఇళ్లు ఇప్పిస్తామని ఒంగోలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల హామీ ఇచ్చారు. ఒంగోలులో జరిగిన ప్రజాగళం సభలో దామచర్ల మాట్లాడుతూ.. కేవలం రెండు రోజులే మిగిలింది. ఈ ఐదుఏళ్లలో గంజాయి బ్యాచుతో మన ఇళ్లపై దాడులు చేయించారు. అభివృద్ధి అడుగంటిపోయింది. నా మీద 23 కేసులు పెట్టారు. మరో 23 రోజుల్లో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని దామచర్ల ధీమా వ్యక్తం చేశారు.
గిద్దలూరు మండలంలోని ముళ్లపాడులో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీకి చెందిన ఇద్దరిని శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.29,500 నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వెల్లడించారు. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారపర్వం మరో 24గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. ఇప్పటికే చంద్రబాబు, జగన్ జిల్లాలో విస్త్రత పర్యటనలు చేశారు. మరికొన్నిచోట్ల డబ్బుల ప్రలోభాలకు తెరలేసింది. రేపు సాయంత్రం 6వరకే అవకాశం ఉండగా అభ్యర్థులు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.
పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, భద్రతపై నిత్యం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిదని కలెక్టర్ దినేష్ కుమార్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఓలు, ఏపీవోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13వ తేదీన పోలింగ్ రోజున దుకాణాలు, కార్మిక సంస్థలకు ఈసీ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లుగా జిల్లా ఉపకార్మిక కమిషనర్ శ్రీనివాస కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటు వేయటానికి అర్హులైన ప్రతి ఒక్కరికి పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్మిక దుకాణాల చట్టం అనుసరించి నిబంధనలు పాటించాలన్నారు.
జిల్లాలో మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,340 సెంటర్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందులో యర్రగొండపాలెం నియోజకవర్గంలో 162, దర్శిలో 187, సంతనూతలపాడులో 163, ఒంగోలులో 193, కొండపిలో 168, మార్కాపురంలో 147, గిద్దలూరులో 168, కనిగిరిలో 152 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంటే సగానికి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ జరగనుంది.
ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కావటానికి ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన YCP, TDP, కాంగ్రెస్ చావో రేవో అన్న విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ముగియడానికి ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో ఇరు పార్టీల ప్రచారాల ఊపందుకున్నాయి. ఒకవైపు ఆత్మీయ సమావేశాల పేరుతో వివిధ సామాజిక వర్గాలు, వృత్తుల వారితో సమావేశమవుతూ, మరోవైపు వ్యూహాలు రచిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు.
ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. జిల్లా మొత్తంలో ఒంగోలు ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉద్యోగులు 99.07% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉద్యోగులు అత్యధికంగా దర్శిలో 98.76% మంది ఓటేశారు. నియోజవర్గాల వారీగా చూస్తే సంతనూతలపాడు 97.52, ఒంగోలు 97.28, కొండపి 96.24, మార్కాపురం 90.89, గిద్దలూరు 94.64, కనిగిరి 93.80 శాతాలుగా నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.