India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గురువారం కూడా అవకాశం కల్పించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ బుధవారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం బుధవారంతో ముగిసిందన్నారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు ఏవైనా కారణాల వల్ల ఓటు వేయకపోతే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నేర నియంత్రణ చర్యలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి, డార్మిటరీలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జీల్లో ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించి, బస చేసినవారి వివరాలను తెలుసుకున్నారు. కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలు ఆరా తీశారు. లాడ్జి నిర్వాహకులు సక్రమంగా రిజిస్టర్ నిర్వహించాలని పోలీసులు సూచించారు.
గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి చెందిన ఘటన సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. రోజూలాగే అందరితో కలిసి కరువు పనికి వెళ్లిన నర్ర సుజాత (53) గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలింది. సుజాత మృతి చెందడంతో పాకల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మార్కాపురం మండలంలోని మాల్యవంతునిపాడు గ్రామంలో పిడుగుపాటుకు గురై గొర్రెలు మృతి చెందాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన పలువురి గొర్రెల మందపై పిడుగు పడింది. దాదాపు 100 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ.8 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.
పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మార్కాపురానికి చెందిన రామకృష్ణ, సిద్దయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆస్తి పంచలేదని తండ్రిపై కుమారుడు దాడిచేసి గాయపరిచిన సంఘటన చీరాల మండలం ఈపూరుపాలెంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సీతారామపేటకు చెందిన శ్రీనివాసరావు కుమారుడు నాగచంద్ర కొంతకాలంగా తనకు రావాల్సిన ఆస్తి పంచమని కోరుతున్నారు. ఈనేపథ్యంలో తండ్రి శ్రీనివాసరావుపై కుమారుడు నాగచంద్ర సోమవారం దాడి చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎండలకు ఉపశమనంలా వచ్చిన వాన కొందరికి సంతోషం, మరికొందరిలో విషాదం నింపింది. పల్నాడు జిల్లా, కుందుర్రివారిపాలెంలో మంగళవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న సంతమాగులూరుకు చెందిన జమ్ముల గోపి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. బతుకుతెరువు కోసం గొర్రెలు మేపుకుంటూ వెళ్లి గోపి మృతి చెందాడు. దీంతో సంతమాగులూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
జిల్లాలో నేటి వరకు 80 శాతం మేర ఓటరు స్లిప్పులను పంపిణీ చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూములో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 18,22,470 మంది ఓటర్లు ఉండగా.. 14,46,495 మందికి ఓటరు స్లిప్పులను అందజేశామని వెల్లడించారు. రెండు రోజుల్లో వంద శాతం పంపిణీ చేస్తామన్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంకవరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు దేవరాజుగట్టు నరసింహులు(32) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో కనిగిరి మినహా మిగిలిన అన్ని కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన పొగాకు వేలంలో కిలో రూ.299 చొప్పున గరిష్ఠ ధర లభించింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 4,394 బేళ్లు రాగా.. వాటిలో 3,822, ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 4,604 రాగా, 3,925 బేళ్లను కొనుగులు చేశారు. వేలం గత పదిహేను రోజుల వ్యవధిలో ఊపందుకోవడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.