India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భర్తను హత్య చేసిన భార్యకు, ఆమె ప్రియుడికి ఒంగోలు సెషన్స్ జడ్జి యావజ్జీవ జైలుశిక్ష విధించారు. పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన బధిర యువకుడు నవాబు సురేశ్‌కు శివ అనే మహిళతో 14 ఏళ్ల కిందట వివాహమైంది. అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఆరుద్ర సాంబశివరావుతో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సురేశ్‌ను నిందితుడు సాంబశివరావు హత్య చేశాడు.
పుల్లలచెరువు మం, ఆర్.ఉమ్మడివరానికి చెందిన ప్రేమ్ కుమార్(35) భార్యా పిల్లలతో గుంటూరులో నివాసం ఉంటున్నారు. అతని భార్య సమోసాలు తయారుచేసే పనికి వెళ్తూ, షాపు యజమానికి దగ్గరైంది. ఈ క్రమంలో భర్తను అడ్డుతొలగించాలనుకొని ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ప్రియుడి తమ్ముడు, మరో వ్యక్తి ప్రేమ్‌ను కొర్నెపాడు వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి కొట్టి చంపేశారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు కేసును ఛేదించారు.
కందుకూరు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణకు చెందిన జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి పొడపాటి శివకుమార్(చక్రి) సింపుల్‌గా ఒక్కడే ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే.. శివకుమార్‌కు వ్యతిరేకంగా ఆయన తండ్రి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయిన పొడపాటి నాగేశ్వరరావు ఇటీవల టీడీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తుండటం విశేషం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 7న దర్శికి రానున్నట్లు టీడీపీ, జనసేన నాయకులు తెలిపారు. దర్శి పట్టణానికి సమీపంలోని శివరాజ్ నగర్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. అక్కడే బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారుల అనుమతి సైతం కోరినట్లు సమాచారం. సాయంత్రానికి పూర్తి షెడ్యూల్ వెల్లడిస్తామని నాయకులు తెలిపారు.
D.El.Ed 4వ సెమిస్టర్ పరీక్షలకు ప్రైవేటు విద్యార్థులు ఈనెల 8వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ నెలలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా 4 సబ్జెక్టులకు రూ.250, 3 సబ్జెక్టులకు రూ.175, రెండింటికి రూ.150 ఒక సబ్జెక్టు రూ.125 చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 15లోగా ఫీజు చెల్లించాలన్నారు.
జిల్లాలో ఈనెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక పోలింగ్లో ఎస్సీ, ఎస్టీలను ఓటు వేయకుండా అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దినేశ్ కుమార్ హెచ్చరించారు. ఓటు వేయకుండా అవాంతరాలు కల్పించినా, తమకు చూపించి ఓటువేయాలని బెదిరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆదివారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో దళితసంఘం నాయకులు ప్రచురించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.
ఎన్నికలు తుది అంఖానికి చేరుకున్నాయి. మరో 7 రోజుల్లో పోలీంగ్ మొదలవుతుంది. దీంతో నాయకులు పథకాలు, హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. 2014 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో YCP 6 స్థానాలు, TDP 5, ఒకరు స్వతంత్రులుగా గెలుపొందారు. 2019లో 8 స్థానాలు YCP గెలవగా, TDP 4 స్థానాలకు పరిమితమైంది. ఈసారి ప్రధాన పార్టీలైన YCP, TDP కూటమి, కాంగ్రెస్ ప్రకాశం జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు?
అద్దంకి పట్టణంలో ఆదివారం రోడ్డు ప్రమాదంలో ముండ్లమూరు మండలంలోని సింగన్నపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అతడిని చికిత్స నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ మురారి సుబ్బమ్మ(65) ఆదివారం వడదెబ్బ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక సోమ్మసిల్లి పడిపోయిన ఆమెను కుటుంబ సభ్యులు ఒంగోలులోని వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సర్పంచ్ సుబ్బమ్మ కోలుకోలేక మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల మండలం, చింతలతుమ్మల బయలు గ్రామం మధ్య ఘాట్ రోడ్‌లో ప్రమాదం జరిగింది. మూలమలుపు వద్ద మంగళగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం వెళ్తుండగా, శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుంటూరు డొంక రోడ్డుకు చెందిన వి.రాజారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.