India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీసీల రక్షణ కోసం బీసీ చట్టం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఎర్రగొండపాలెంలోనీ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎరిక్షన్ బాబును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఒంగోలులో ఆర్‌ఎం స్కూల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లలో లోపాలు తలెత్తడంతో కొద్దిసేపు సందిగ్ధత నెలకొంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు వేసే ముందు వారు సమర్పించే పత్రాల్లో గెజిటెడ్ సంతకంతో పాటు స్టాంప్‌కూడా ఉండాలి. కానీ ఆర్‌ఎం స్కూల్‌లో 16 మంది ఉద్యోగుల పత్రాలపై గెజిటెడ్ సంతకం ఉంది. కానీ స్టాంప్ లేకపోవడాన్ని గుర్తించారు. ఉద్యోగులు కొద్దిసేపు నిరసన తెలిపాక స్టాంప్ వేసి ఓటు వేయించారు.
అద్దంకిలోని సింగరకొండ రోడ్డులో ఆదివారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కావలికి చెందిన రాజేష్, నెల్లూరుకి చెందిన చరణ్‌లు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళుతుండగా అద్దంకి దగ్గరకు వచ్చేసరికి డివైడర్‌ను ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందగా, చరణ్‌ను 108లో ఒంగోలు తీసుకు వెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 9న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంగోలుకు రానున్నారు. 9 వతేది పవన్ కళ్యాణ్ రాకుంటే 11వతేది మధ్యాహ్నం 3 గంటలకు నగరంలో రోడ్డుషోలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని కూటమి నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు తుది గడువు కానున్న నేపథ్యంలో వారి చివరి ప్రసంగం ఒంగోలులోనే ఇవ్వనున్నారు.
సంతనూతలపాడు కూటమి MLA అభ్యర్థి BN విజయ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. ఆ పార్టీ శ్రేణుల వివరాల ప్రకారం.. చీమకుర్తి మండలంలోని చీమలమర్రిలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో BN పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో డ్రోన్ కెమెరా అకస్మాత్తుగా తన మీదకు వచ్చేసింది. వెంటనే ఆయన చేతులను అడ్డుపెట్టుకున్నారు. దీంతో ఆయన చేతి వేళ్లకు స్వల్పగాయాలయ్యాయి. చీమకుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.
కొండపి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం సింగరాయకొండ మండలం నర్రావారిపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణ సంచా పేల్చగా నిప్పు రవ్వలు ఎమ్మెల్యే స్వామి కంటికి తగిలాయి. దీంతో ఆయనను ఒంగోలులో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఒంగోలులోని జిల్లా జైలులో ములాఖత్ వేళలు మార్పు చేసినట్లు జిల్లా కారాగార పర్యవేక్షణ అధికారి వరుణ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ములాఖత్ లు నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 15వ తేదీ వరకు ఈ సమయం కొనసాగుతుందని చెప్పారు. కావున జిల్లా ఖైదీల బంధువులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
పొదిలి మండలం కంబాలపాడు గ్రామ సమీపంలోని సచివాలయం దగ్గరలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిని స్థానికులు గుర్తించి పొదిలి పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కోటయ్య మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సరిగ్గా మరో నెల రోజుల్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ స్టార్ట్ అవ్వగా.. మే13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కించి ఎమ్మెల్యే ఎవరో ప్రకటిస్తారు. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను 8 వైసీపీ, 4 టీడీపీ స్థానాల్లో గెలిచాయి. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్ చెయ్యండి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శికి చేరుకున్నారు. దర్శిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
Sorry, no posts matched your criteria.