India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మార్కాపురం సర్వ జన వైద్యశాలలో శుక్రవారం చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వ్యక్తి(60) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 2న గిద్దలూరులోని రాచర్ల గేటుకు సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎండ వేడికి బాగా నీరసించి స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించగా శుక్రవారం మృతి చెందాడు.
ప్రకాశం జిల్లాలో మొదటి ఓటరుగా యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజన గూడేనికి చెందిన జండా వత్ నాగలక్ష్మీ బాయి స్థానం సంపాదించుకున్నారు. యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజనగూడెంలో మొదటి బూత్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచే ఓటరు జాబితా కూడా ప్రారంభమవుతుంది. మైదాన ప్రాంతం నుంచి పాలుట్ల చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు పాలుట్ల వెళ్లేందుకు ప్రత్యేక కమాండర్ జీపులను వినియోగిస్తున్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పొట్టి మార్కుల జాబితాను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్సైట్ లో సిద్ధంగా ఉన్నట్లుగా డీఈఓ సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వెబ్‌సైట్ నుంచి మార్కుల జాబితాలు డౌన్‌లోడ్ చేసి ప్రధానోపాధ్యాయులు అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. ఈ మార్కులు జాబితాలతో విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందవచ్చన్నారు.
చంద్రబాబుకు ఓటు వేస్తే అన్ని పథకాలకు ఇక ముగింపేనని సీఎం జగన్ అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిగిరిలో మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనన్నారు . 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదని, ఇప్పుడు మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చామన్నారు.
గిద్దలూరు పట్టణంలోని ఎంపీడివో ఆఫీసు సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని జీపు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఒంగోలు YCP MP అభ్యర్థి MLA చెవిరెడ్డిపై నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన సభలో లోకేశ్ మాట్లాడారు. ‘చంద్రగిరిని ఐదేళ్లు దోచుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రూ.2 వేల కోట్లు సంపాదించారు. ఆయన సినిమా అయిపోవడంతో ప్రకాశం జిల్లాకు పారిపోయారు. శ్రీవారి దర్శన టికెట్లు, గంజాయి, ఎర్రచందనంతో బాగా సంపాదించారు. అందుకే ఆయనకు చెవిలో పువ్వు అని పేరు పెట్టా’ అని లోకేశ్ అన్నారు.
ఇవాళ ప్రకాశం జిల్లాకు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రానున్నారు. కూటమి అభ్యర్థులను మద్దతుగా గిద్దలూరులో ఏర్పాటు చేసిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొదిలిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం జగన్ కనిగిరిలో పర్యటించనున్నారు. దీంతో జిల్లాలో పార్టీ అధినేతలు వస్తుండటంతో అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
అప్పుల బాధ తాళలేక ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శింగరాయకొండలో బుధవారం వెలుగు చూసింది. ఎస్సై శ్రీరామ్ కథనం మేరకు కుంచాల శ్రీకాంత్ అనే వ్యక్తి ఆటో తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెలావారీ ఫైనాన్స్ చెల్లించక పోవడంతో ఫైనాన్స్ సిబ్బంది ఆటోను తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వలేటివారిపాలెం మండలం పోకూరుకి చెందిన జడ రవీంద్ర మృతి చెందాడు. గ్రామానికి చెందిన రవీంద్ర హైదరాబాదులోని ఓ కంపెనీకి చెందిన బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం మోటర్ బైక్ పైన హైదరాబాద్ నుంచి పోకూరు బయలుదేరిన రవీంద్ర చిట్యాల సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి బంధువులకు సమాచారం అందించారు.
గిద్దలూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. గిద్దలూరు నుంచి పోరుమామిళ్ల వెళ్లే బస్సుకి బ్రేకులు ఫెయిల్ అవడంతో బస్టాండ్‌లోని ప్లాట్‌ఫారంపైకి దూసుకొచ్చింది. దీంతో బస్టాండులోని ఫిల్టర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Sorry, no posts matched your criteria.