India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ కొండపిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై సరదాగా వ్యాఖ్యలు చేశారు. ‘మన ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు. నాకంటే పొట్టి, కానీ వయసులో నేనే పెద్ద’ అంటూ నవ్వులు పూయించారు. ఇక్కడి పొగాకు చూస్తే తనకు వీరసింహారెడ్డి సినిమా గుర్తుకువచ్చిందన్నారు. ఈ సందర్భంగా బాలయ్య పలు సినిమాల డైలాగులు చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు.
మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లో ఈతకెళ్లి ఒంగోలుకు చెందిన ఆటోడ్రైవర్ గొరిపర్తి సాంబశివరావు (35) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి గుండ్లకమ్మ జలాశయంలో ఈత కొట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సోమవారం ఉదయం మృతదేహం నీటిలో తేలియాడింది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రమేశ్ చెప్పారు.
ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈనెల 22వ తేదీన 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 38 పరీక్ష కేంద్రాల్లో సజావుగా సాగాయని యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి పద్మజ తెలిపారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లుగా తెలిపారు.
ప్రకాశం జిల్లాలో ఇవాళ నారా లోకేశ్ ఒంగోలు, పవన్ కళ్యాణ్ గిద్దలూరు, దర్శి, ఒంగోలు, సీఎం జగన్ కొండపి, నందమూరి బాలకృష్ణ సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీంతో అభ్యర్థులు జనసమీకరణలు చేస్తున్నారు. ఇక పోలీసులు వీరి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతను రెట్టింపు చేశారు. ఒకేసారి జిల్లాకు నలుగురు రావడంతో జిల్లాలో రాజకీయ వేడి పులుముకుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మానవత్వం మంటకలిసిన రోజు. ఓ క్షతగాత్రుడు రోడ్డుపై రక్తమోడుతున్నా ఎవరూ పట్టించికోలేదు. తోటి స్నేహితులు ఎంత ప్రయత్నించిన కాపాడుకోలేకపోయారు. ఒంగోలులోని ఓ కళాశాల ఎదురుగా విద్యార్థి వెంకటేశ్ రోడ్డు దాటుతూ ఉండగా ఓ కాలేజ్ బస్సు ఢీకొనడందో పక్కనే ఉన్న డివైడర్‌పై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. తోటి విద్యార్థులు అతడిని వెంటనే రిమ్స్‌కు తరలించినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు.
ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా అన్నారు. తనిఖీల పేరుతో సామాన్య జనానికి ఇబ్బంది కలిగించరాదని స్పష్టం చేశారు. సోమవారం ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగేలా జిల్లా యంత్రాంగం చేపట్టినపై చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ దినేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన వృద్ధుడు బాలయ్య(73) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. నల్లగుంట్ల సమీపంలో ఉదయాన్నే ఉపాధి హామీ పనికి వెళ్లిన బాలయ్య పనిచేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు గమనించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బాలయ్యను తరలించారు. వైద్యలు పరీక్షించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
పీసీపల్లి మండలం వరిమడుగుకు చెందిన కొడవటిగంటి శాంసన్(34) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వెంగళాయపల్లి-దరిమడుగు గ్రామాల మధ్యలో ఆదివారం అనుమానాస్పద రీతిలో మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ బాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కనిగిరి వైద్యశాలకు తరలించారు.
అద్దంకి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా గట్టి పట్టు ఉన్న నేత, అన్ని మండలాలలో ఆయనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేదరమెట్ల గ్రామం లాంటి మేజర్ పంచాయతీలలో, ఆయనకు కుడి భుజంగా మెలిగే అనుచరవర్గం ఉంది. కరణం టీడీపీని వీడి వైసీపీలో కొనసాగుతూ ఉండటంతో.. అద్దంకిలో ఆయన వర్గీయులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారని నియోజకవర్గవ్యాప్తంగా ఆసక్తికర చర్చ నెలకొంది.
దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే. పోలీసులు వివరాల మేరకు ఆస్తి తగాదాలతో రాజా వెంకటేష్(32) అనే యువకుడిని చిన్నమ్మ కూతురు భర్త బంధువులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. చిన్నమ్మ కూతురుపై దాడికి యత్నించడంతో వెంకటేష్ అడ్డు రావడంతో కత్తులతో పొడిచి పరారయినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.