Prakasam

News April 12, 2024

18న నామినేషన్ వేయనున్నట్లు బూచేపల్లి ప్రకటన

image

దర్శి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బూచేపల్లి కుటుంబం రుణపడి ఉంటామన్నారు. తనను ఆశీర్వదించేందుకు మహిళలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.

News April 12, 2024

చీరాల: ఇసుక లోడ్‌లో బయటపడ్డ మృతదేహం

image

ఇంటి నిర్మాణానికి తెప్పించుకున్న ఇసుక లోడ్‌లో మృతదేహం రావడం కలకలం రేపింది. చీరాల మండలం ఈపూరుపాలెంలో మాజీ ప్రజా ప్రతినిధి పద్మనాభునిపేటలో నిర్మిస్తున్న కొత్త ఇంటికి అవసరమైన ఇసుకకు ఆర్డర్ ఇవ్వగా శుక్రవారం ఉదయం లోడ్ వచ్చింది. ఇసుకను దింపుతుండగా అందులో తల లేని ఒక యువకుడి మృతదేహం బయటపడడంతో అందరూ భయభ్రాంతులయ్యారు. ఎలా ఇసుకలోకి ఈ మృతదేహం వచ్చిందో ఎవరికి అంతు పట్టడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News April 12, 2024

ప్రకాశం జిల్లాలో ఇంటర్‌లో ఎంతమంది పాసయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ఇయర్‌లో 18,349 మందికి 10,868 మంది పాసయ్యారు. దీంతో 59 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌‌లో 15,238 మందికి 10,993 మంది విద్యార్థులు పాసయ్యారు. 72 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 15వ స్థానం సాధించింది. మొదటి సంవత్సరం కంటే ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో మెరుగైన ఫలితాలు వచ్చాయి.

News April 12, 2024

ప్రకాశం: నేడు తేలనున్న ఇంటర్ విద్యార్థుల‌ భవితవ్యం

image

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయని ఆర్ ఐవో సైమన్ విక్టర్ చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను 39,377మంది రాశారు. వీరిలో 19,233 మంది మొదటి సంవత్సరం, 18,128 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం కొన్ని నిమిషాలలో తేలనుంది. ఇప్పటికే విద్యార్థులు ఫలితాల కోసం నెట్ సెంటర్ల వద్దకు చేరారు.

News April 12, 2024

‘ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి ఆమంచికి లేదు’

image

ఆమంచి కృష్ణమోహన్‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వైసీపీ నాయకులు హెచ్చరించారు. చీరాలలో పట్టణ అధ్యక్షుడు కొండ్రు బాబ్జి మాట్లాడుతూ.. చీరాలను ప్రశాంత వాతావరణంలో పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ప్రజలు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి సాగనంపారని, అదే సీను 2024 ఎన్నికల్లో మరోసారి చూపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

News April 12, 2024

చీరాల: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

image

ఇంట్లో వారు మందలించారనే మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చీరాల మండలం వాడరేవులో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శివకుమార్ వివరాల మేరకు.. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన ఎం.నాగేంద్ర(23) చీరాలలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఉద్యోగానికి వెళ్లకపోవడంతో ఇంట్లో వారు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News April 12, 2024

ప్రకాశం జిల్లాలో ఎస్ఈసీ ముఖేష్ కుమార్ మీనా

image

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ప్రకాశం జిల్లాలో గురువారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ సమీపంలో ఉన్న చెక్ పోస్టును ఆయన తనిఖీ చేశారు. రోజువారి నిర్వహిస్తున్న రిజిస్టర్‌ను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్, జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.

News April 11, 2024

ప్రకాశం: ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలి

image

ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్‌కు అనుగుణంగా అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆదేశించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ నోడల్ అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని, ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టాలన్నారు.

News April 11, 2024

ప్రకాశం: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

image

జిల్లాలోని రాచర్ల మండలం అనుములపల్లిలో ఉపాధి పనికి వెళ్లిన కూలీ గల్ల ఆంజనేయులు (55) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పనిచేస్తుండగా ఆంజనేయులుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మిగతా కూలీలు గమనించి హుటాహుటిన రాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఆంజనేయులు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

News April 11, 2024

ఒంగోలు: 30 మంది TDP నేతలపై కేసు నమోదు 

image

ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనలో సమతానగర్ పరిధిలోని వాలంటీర్ సుజన ప్రియా ఫిర్యాదు మేరకు 30 మంది TDP నేతలపై గురువారం పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వాలంటీర్‌తో కలిసి YCP నేతలు ప్రచారం చేస్తున్నారని కొందరు ఫొటో తీశారు. దీనిపై రగడ జరగడం, ఆ వార్డు టీడీపీ బాధ్యుడు మోహన్ రావు అక్కడికి వెళ్లడంతో గొడవ పెద్దదైంది. అనంతరం రిమ్స్‌లో ఇరు వర్గాల కవ్వింపు చర్యల నేపథ్యంలో TDP నేతలపై కేసు నమోదైంది.