India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీశైలానికి కాలినడకన వచ్చి వెళుతున్న కన్నడ వాసుల సౌకర్యార్థం విజయవాడ నుంచి గిద్దలూరు మీదుగా హుబ్లీకి ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 10న విజయవాడలో రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.48 గంటలకు గిద్దలూరుకు చేరుకుంటుందన్నారు. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు హుబ్లీ చేరుతుందని చీఫ్ కమర్షియల్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం మధ్యాహ్నం తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి.. ఏడాది పాటు పర్చూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అయితే ఆయనకు చీరాల టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ జిల్లా అంతటా తీవ్ర ఆసక్తిగా మారింది.
కూలి పనులకి ఆటోలో వెళుతుండగా ప్రమాదవశాత్తు మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చీరాల వేటపాలెం బైపాస్ రోడ్డులో జరిగింది. చేనేతపురికి కాలనీకి చెందిన మస్తానీ కొందరు కూలీలతో కలిసి వ్యవసాయ పనులకు ఆటోలో బయలు దేరారు. ఆటోలో వెనుక వైపు కూర్చున్న ఆమెకు ఎద్దుల బండిలో తరలిస్తున్న రేకులు ప్రమాదవశాత్తు కడుపులో దిగాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది.
2009లో కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి రవి కుమార్ 15,764 ఓట్లు మెజార్టీతో విజయం సాధించగా.. 1999లో టీడీపీ నుంచి బి.గరటయ్య కేవలం 249 ఓట్లతో గెలిచారు. అద్దంకిలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా.. గొట్టిపాటికి వచ్చిన 15,764 ఓట్ల మెజార్టీనే అత్యధిక రికార్డు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి హనిమిరెడ్డి, కూటమి నుంచి మరోసారి గొట్టిపాటి బరిలో ఉన్నారు. ఈయన రికార్డును హనిమిరెడ్డి బ్రేక్ చేయగలరనుకుంటున్నారా.
అనారోగ్యంతో వృద్ధుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాళ్లూరు పట్టణములోని కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కోటారామిరెడ్డి (75) కొంతకాలంగా నరాల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. ఇరుగుపొరుగువారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రిసైడింగ్, ఏపీవోలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రెండో విడతలో 70 మంది అధికారులు నియామక ఉత్తర్వులు అందుకుని శిక్షణకు గైర్హాజరు అయ్యారు. వారందరికీ జిల్లా ఎన్నికల అధికారి దినేశ్ కుమార్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సెలవు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి వంటి మత్తుపదార్థాలు అమ్మకం వంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సెబ్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో నాటు సారా తయారీ, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలన్నారు.
ఓటు ఉండి ఎపిక్ కార్డులేని ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకదానితో ఓటు వేయవచ్చని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిక్ కార్డులేని ఓటర్లు ఆధార్, ఉపాధి కార్డు, బ్యాంకు, పోస్టాఫీసులు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, కార్మికమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమాస్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉన్నా ఓటు వేయవచ్చని పేర్కొన్నారు.
గుండెపోటుతో ఉపాధి హామీ కూలి మృతి చెందిన ఘటన సోమవారం తర్లుపాడు మండల పరిధిలోని మంగళ కుంటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేశ బోయిన పెద్ద కాశయ్య మల్లమ్మ బోడు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మార్కాపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో టీచర్ల విదేశీ ప్రయాణ అనుమతులను రద్దు చేస్తూ పాఠశాల విద్యా కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో వారిని నియమించి శిక్షణ ఇస్తున్నారు. మే 13లోపు విదేశాలకు వెళ్లేందుకు పొందిన అనుమతులను రద్దు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 13న పోలింగ్ ముగిశాక విదేశాలకు వెళ్లే అనుమతులు ఇచ్చేందుకు ఆన్‌లైన్లో సమర్పించాలని డీఈవో సుభద్ర తెలిపారు.
Sorry, no posts matched your criteria.