Prakasam

News April 5, 2024

కాంగ్రెస్ నుంచి చీరాల బరిలో ఆమంచి..?

image

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ నియోజకవర్గంలో క్రియాశీలక పాత్రను పోషించారు. వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో శుక్రవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎక్కడి నుంచి బరిలో నిలిచిన పోటాపోటీ తప్పదని పలువురు భావిస్తున్నారు. 

News April 5, 2024

గిద్దలూరు MLA అన్నా రాంబాబు పై కేసు నమోదు

image

గిద్దలూరు MLA అన్నా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాసప్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో కార్యకర్తలకు స్థానిక కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆర్.సంతోష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 5, 2024

ప్రకాశం: వ్యక్తి ఆత్మహత్య

image

సంతమాగులూరు మండలం పుట్ట వారిపాలెం గ్రామంలోని ప్రమీల సీడ్స్ యజమాని చిరుమామిళ్ల సురేంద్ర గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం దుకాణానికి వచ్చిన సురేంద్ర పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇది గమనించిన షాపులోని గుమస్తా బాధితుడిని హుటాహుటీన నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సురేంద్రకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

News April 4, 2024

ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్

image

ప్రకాశం జిల్లా ఎస్పీగా 2015 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సుమిత్ సునీల్ ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 8 గంటలలోపు విధుల్లోకి చేరాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

News April 4, 2024

గెలిపిస్తే అభివృద్ధి చేస్తా: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

image

ప్రకాశం జిల్లాలోనే తన సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటానని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం పీసీపల్లి మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

News April 4, 2024

ప్రకాశం: గుప్త నిధుల కోసం తవ్వకాలు

image

కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ పరిధిలోని అంబాపురం గ్రామ శివారులో పురాతనమైన అంబబాలత్రిపుర సుందరీదేవి ఆలయంలో కొందరు దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు. ఆలయం వెనక వైపు రాతి గోడలను ధ్వంసం చేశారు. గ్రామస్థులు గమనించి బుధవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్సై గోపాలకృష్ణ పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

News April 4, 2024

కొత్తపట్నం: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెంలో కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడేనికి చెందిన ఆర్.సంజీవ వర్మ (32) పల్లెపాలెంలోని ‘మీరాకి ‘ జంతు సంరక్షణ సంస్థలో మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. స్నానానికి వెళ్లి స్విచ్ వేయగా, కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

News April 4, 2024

చీరాలలో TDP రెబల్ అభ్యర్థిగా పోటీ

image

చీరాలలో టీడీపీ రెబల్ అభ్యర్థి తయారయ్యారు. రానున్న ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు పొన్నూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత బుధవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ప్రజారాజ్యం, వైసీపీ తదితర పార్టీలు మారిన హేమలతకు టీడీపీ పొన్నూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇచ్చింది. అయితే ఆమె ఈ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ టీడీపీ టికెట్ ఆశించారు. అది రాకపోవడంతో తిరుగుబాటు చేశారు.

News April 4, 2024

పర్చూరులో జెండా పాతేది ఎవరు.?

image

పర్చూరు నియోజకవర్గంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. ఏలూరి సాంబశివరావు 2014, 19 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. 2019లో కేవలం 1647 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, మరోసారి పోటీచేస్తూ హ్యట్రిక్‌పై కన్నేశారు. అటు ఎడం బాలాజీ 2019 చీరాల నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. మరోసారి చీరాల టికెట్ ఆశించగా కుదరక పర్చూరు నుంచి బరిలో ఉన్నారు. మొత్తం 2,25,770 ఓట్లలో మెజారిటీ ఓట్లు సాధించి ఎవరు గెలుస్తారో.?

News April 4, 2024

నో వైలెన్స్.. నో రీపోల్ లక్ష్యం: ప్రకాశం SP

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో నో వైలెన్స్.. నో రీపోల్ లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన సింగరాయకొండ పోలీసు స్టేషన్ సందర్శించారు. ఈసందర్భంగా SP మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టనునట్లు తెలిపారు. పీఎస్ రికార్డులు పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు.